నాగిపై ప్రేమను మాటల్లో చెప్పలేను: విజయ్ దేవరకొండ
నేచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ కలిసి ఎవడే సుబ్రమణ్యం సినిమా చేసిన సంగతి తెలిసిందే.;
నేచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ కలిసి ఎవడే సుబ్రమణ్యం సినిమా చేసిన సంగతి తెలిసిందే. మాళవికా నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కింది. వైజయంతీ బ్యానర్ లో వచ్చిన ఈ న్యూ ఏజ్ డ్రామా 2015, మార్చి 21న రిలీజ్ అయి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
సినిమా రిలీజై పదేళ్లవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ రీరిలీజ్ ను ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే టీమ్ మొత్తం కలిసి రీయూనియన్ పార్టీ చేసుకున్నారు. ఈ రీయూనియన్ లో నాని, విజయ్, మాళవికతో పాటూ చిత్ర యూనిట్ మొత్తం పాల్గొని ఫోటోలు దిగి సందడి చేశారు. ప్రస్తుతం ఆ రీయూనయన్ సందర్భంగా దిగిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ రీయూనియన్ లో భాగంగా ఆ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరూ తమ అనుభవాన్ని పంచుకున్నారు. స్కూల్ రీయూనియన్ ఫంక్షన్ కు వెళ్తున్నట్టుందని నాని అంటే, ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ చదివినంత టైమ్ గడిచిందని విజయ్ అన్నాడు. ఈ సందర్భంగా సినిమాలోని ఓ సీన్ గురించి విజయ్ చెప్పిన వీడియో కూడా ఆల్రెడీ నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎంతో గుర్తింపు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అందుకే ఈ రీయూనియన్ లో విజయ్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఆ మూవీ టైమ్ లో జరిగిన విషయాలను వెల్లడిస్తూ డైరెక్టర్ నాగిని విజయ్ కౌగిలించుకున్నారు. తనకు నాగి అంటే ఎంత ప్రేమో మాటల్లో చెప్పలేనని, ఈ సినిమా తనకెంతో స్పెషల్ అని విజయ్ చెప్పారు. దానికి సంబంధించి మూవీ టీమ్ ఓ వీడియోను షేర్ చేయగా ఆ వీడియోను విజయ్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.