సినిమా బిజినెస్ లో రచ్చ డైరెక్టర్ సేఫ్ గేమ్

ఇక నెక్స్ట్ తమన్నా తో తీసిన ఒక డిఫరెంట్ ప్రాజెక్టుతో అతను చేసిన బిజినెస్ ఇండస్ట్రీలో హైలెట్ అవుతోంది.;

Update: 2025-03-17 06:10 GMT

రచ్చ సినిమాతో అవకాశం అందుకొని ఒకప్పుడు ఇండస్ట్రీలో అందరిని షాక్ కు గురి చేశాడు సంపత్ నంది. ఆ తరువాత దర్శకుడు మళ్ళీ మరో బిగ్ హీరోతో ఛాన్స్ అందుకోలేకపోయాడు. గౌతమ్ నంద, బెంగాల్ టైగర్ వంటి సినిమాలతో హడావుడి చేసినప్పటికీ అనుకున్నంత రేంజ్ లో బ్రేక్ ఇవ్వేలేకపోయాయి. ఇక నిర్మాతగా సంపత్ అప్పుడప్పుడు కొన్ని ప్రయోగాలు చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ తమన్నా తో తీసిన ఒక డిఫరెంట్ ప్రాజెక్టుతో అతను చేసిన బిజినెస్ ఇండస్ట్రీలో హైలెట్ అవుతోంది.

సినిమా రిలీజ్‌కు ముందే బిజినెస్ లెక్కలు పూర్తవడం అంటే సాధారణ విషయం కాదు. థియేట్రికల్ రన్ మీద పూర్తి ఆధారపడే పరిస్థితుల్లో, ఓటీటీ, శాటిలైట్ డీల్స్ తెచ్చే ఆదాయం ఎంతో కీలకం. అయితే, భారీ సినిమాలు కూడా ఓటీటీ డీల్స్ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యల మధ్య, తమన్నా తాజా చిత్రం మాత్రం సేఫ్ జోన్‌లోకి వెళ్లింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇప్పటికే పూర్తయ్యాయి.

తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఓదెల 2 సినిమాకు, ముందుగా ఓటీటీ మార్కెట్ నుండి బలమైన రెస్పాన్స్ వచ్చింది. అశోల్ తేజ ఈ సినిమాకు దర్శకుడు కాగా సంపత్ నంది నిర్మిస్తున్నారు. ఇక తొలి భాగమైన ఓదెల రైల్వే స్టేషన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో మంచి విజయం సాధించడంతో, ఈ సీక్వెల్‌పై కూడా మంచి హైప్ ఏర్పడింది. టీజర్ విడుదలైన వెంటనే అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దాదాపు రూ.12 కోట్లకు సొంతం చేసుకుంది. అదే సమయంలో హిందీ డబ్బింగ్ హక్కులు రూ.6.25 కోట్లకు అమ్ముడుపోవడం మరో విశేషం.

సినిమా మొత్తం బడ్జెట్ సుమారు రూ.20 కోట్లుగా నిర్ణయించగా, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఇప్పటికే మొత్తం ఖర్చు రికవరీ అయ్యింది. దీంతో నిర్మాత సంపత్ నంది మరింత హైప్ పెంచేలా ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం శాటిలైట్ డీల్ కూడా చివరి దశలో ఉన్నట్లు సమాచారం. థియేట్రికల్ వసూళ్లు పూర్తిగా లాభంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక తమన్నా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం ప్రత్యేక ఆకర్షణ. ఇటీవల వెబ్ సిరీస్‌లతో బిజీగా మారిన ఆమె, ఈ సినిమా హిట్ అయితే, మళ్లీ తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకునే ఛాన్స్ ఉంది. తెలుగులో తన మార్కెట్ నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్రను ఎంచుకున్నట్లు సమాచారం.

ఇక సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఇప్పటికే ప్రమోషన్లకు శ్రీకారం చుట్టే పనిలో ఉంది. తెలుగులో ఓ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న తమన్నా, ఓదెల 2తో హిట్ కొట్టే ప్రయత్నం చేస్తోంది. బిజినెస్ లెక్కలు చూసినట్లయితే, ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌తో కూడా అదిరిపోయే వసూళ్లు సాధించే అవకాశం ఉంది.

Tags:    

Similar News