కాంతార 2 రిలీజ్ - ఇది గోల్డెన్ ఛాన్సే..
చిన్న సినిమా నుండి భారీ బ్లాక్‌బస్టర్‌గా మారిన ఈ సినిమా ఇప్పుడు కాంతార చాప్టర్ 1 పేరుతో ప్రీక్వెల్ రూపంలో వస్తోంది.;
కాంతార మొదటి భాగం కేవలం చిన్న సినిమాగా విడుదలై, అద్భుతమైన మౌత్ టాక్‌తో అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది. ఓపెనింగ్ డే కేవలం రూ.2.5 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, హిందీ మార్కెట్‌లోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడం విశేషం. చిన్న సినిమా నుండి భారీ బ్లాక్‌బస్టర్‌గా మారిన ఈ సినిమా ఇప్పుడు కాంతార చాప్టర్ 1 పేరుతో ప్రీక్వెల్ రూపంలో వస్తోంది. ఈ సినిమాకు ఉన్న హైప్‌ను బట్టి చూస్తే, ఈసారి కనీసం రూ.800-1000 కోట్ల గ్లోబల్ గ్రాస్ టార్గెట్‌గా పెట్టుకోవచ్చు.
ఇక సినిమా విడుదల తేదీలు మారడం వల్ల అనూహ్యంగా కొన్ని సినిమాలకు లాభం కలుగుతుంది. అచ్చం అదే విధంగా ఇప్పుడు కాంతార 2కు కూడా భారీ బూస్ట్ లభించింది. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ సినిమా విడుదల షెడ్యూల్ మార్చుకోవడంతో, కాంతార 2 హిందీలో గాంధీ జయంతి రోజున సింగిల్ రిలీజ్ అవుతోంది. ఈ మార్పుతో దసరా కానుకగా ఈ చిత్రం భారీ వసూళ్లకు దారి తీసేలా కనిపిస్తోంది.
ఇది సాధ్యమేనని చెప్పడానికి ప్రధాన కారణం గాంధీ జయంతి విడుదలతో పాటు దసరా సెలవులు కలసి రావడం. వాస్తవానికి వరుణ్ ధావన్ నటించిన హై జవానీ తో ఇష్క్ హోనా హై చిత్రం అక్టోబర్ 2న రిలీజ్ కావాల్సి ఉండగా, ఇప్పుడు వాయిదా పడింది. దీంతో ఈ విడుదల తేదీ పూర్తిగా కాంతార 2కు కేటాయించబడింది. హిందీ మార్కెట్‌లో వరుణ్ ధావన్ సినిమా పోటీ ఉండదనే విషయం, ఈ సినిమాకు ప్లస్ పాయింట్.
ఇక ఈ సినిమా విజయానికి కీలకమైన అంశం కథ. రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గతం గురించి విస్తృతంగా చూపించనున్నారు. అడవి, సంప్రదాయాలు, దైవభక్తి, గ్రామీణ భావజాలం ఈ చిత్రంలో మరింత డీప్‌గా వెళ్లనుంది. పైగా, కాంతార మొదటి భాగం మలయాళ, తమిళ, తెలుగు మార్కెట్లలో కూడా హిట్ కావడంతో ఈసారి విడుదల భారీ స్థాయిలో ఉంటుంది.
ప్రస్తుతం బాక్సాఫీస్ పోటీ గురించి మాట్లాడుకుంటే, కాంతార 2 ప్రధానంగా వార్ 2 చిత్రంతో ఢీకొనబోతోంది. అయితే, ఈ చిత్రం విడుదలకు మరో కొంత సమయం ఉండటంతో, కాంతార 2 ఇప్పటికే తన స్థానం పక్కాగా సెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. బాలీవుడ్ నుండి పోటీ లేకపోవడం, సౌత్‌లో హైప్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ సినిమా 2025లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అవ్వాలని చూస్తోంది.