ఏంటీ.. బాలీవుడ్ కింగ్ తో మన సుకుమార?

హిందీ మార్కెట్‌లో కూడా అన్‌స్టాపబుల్‌గా రన్ అవుతూ భారీ వసూళ్లు సాధించడంతో బాలీవుడ్ అగ్ర దర్శక, నిర్మాతల దృష్టి సుకుమార్ మీద పడింది.;

Update: 2025-03-17 10:15 GMT

పుష్ప 2 తో టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌ను కూడా షేక్ చేసిన దర్శకుడు సుకుమార్. గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను గందరగోళం చేసి 1800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అల్లు అర్జున్ నటన, సుకుమార్ మాస్టర్పీస్ మేకింగ్‌తో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అద్భుత విజయాన్ని సాధించింది. హిందీ మార్కెట్‌లో కూడా అన్‌స్టాపబుల్‌గా రన్ అవుతూ భారీ వసూళ్లు సాధించడంతో బాలీవుడ్ అగ్ర దర్శక, నిర్మాతల దృష్టి సుకుమార్ మీద పడింది.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం సుకుమార్ RC17 ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్‌తో పుష్ప తరహాలో కాకుండా పూర్తిగా కొత్త కథతో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించడానికి సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. సుకుమార్ క్రియేటివ్ వర్క్ నెక్స్ట్ లెవల్‌గా ఉండేలా స్క్రిప్ట్ రాయడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రంగస్థలం తరహాలోనే RC17 కూడా చరణ్‌కు మరొక బిగ్ హిట్ గా మారేలా స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, సుకుమార్ లైనప్‌లో పుష్ప 3 కూడా ఉంటుందనే విషయం ఇటీవల నిర్మాతలు ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ద్వారా క్లారిటీ వచ్చింది. అయితే ఇది వెంటనే సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి అల్లు అర్జున్ వేరే ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటంతో పుష్ప 3 కొంత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ పుష్ప 2 ఇచ్చిన బిగ్ హిట్ వల్ల దీనిపై మాస్ ప్రేక్షకుల్లో ఆసక్తి మాత్రం బాగా పెరిగిపోయింది.

అయితే ఊహించని విధంగా ఇప్పుడు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ - సుకుమార్ కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్ రాబోతోందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, సుకుమార్ డైరెక్షన్‌లో SRK ఓ ఇంటెన్స్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నాడట. అంజామ్(1994) తరహా సైకలాజికల్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా సౌత్ + నార్త్ మిక్స్‌డ్ కథాంశంతో ఉండబోతోందట.

ముఖ్యంగా, షారుఖ్ ఖాన్ తన ఇంటర్వ్యూలలో పలు మార్లు అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని మేనరిజమ్ గురించి ప్రశంసించడం ఆసక్తికరమైన విషయం. అదే టైంలో, సుకుమార్ స్టైల్ నేరేషన్, విజువల్స్ చూసిన బాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు కురిపించారు. దీంతో సడన్ గా ఈ కాంబోపై అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం అనే విషయంలో ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

Tags:    

Similar News