అలాంటి పాత్రలు రాలేదని ఎన్నో సార్లు అనుకున్నా
తాజాగా శివాజీ మంగపతి పాత్రలో నటించిన కోర్టు సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా ఆ సినిమా రిలీజ్ తర్వాత అందరూ శివాజీ గురించే మాట్లాడుకుంటున్నారు.;
బిగ్ బాస్ తర్వాత శివాజీకి మంచి క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ తోనే రిలీజైన 90స్ వెబ్ సిరీస్ కు తెలుగు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ సిరీస్ తర్వాత ఆయనకెన్నో అవకాశాలొచ్చాయి కానీ అన్నీ తండ్రి పాత్రలే కావడంతో వాటిని రిజెక్ట్ చేశారు శివాజీ. కెరీర్లో డిఫరెంట్ క్యారెక్టర్లు చేయాలనే ఉద్దేశంతోనే శివాజీ ఆ ఛాన్సులన్నింటినీ వదులుకున్నట్టు తెలిపారు.
తాజాగా శివాజీ మంగపతి పాత్రలో నటించిన కోర్టు సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా ఆ సినిమా రిలీజ్ తర్వాత అందరూ శివాజీ గురించే మాట్లాడుకుంటున్నారు. మంగపతి లాంటి పాత్రలు కోసం తానెంతో కాలంగా వెయిట్ చేస్తున్నాని, తాను సినిమాలు చేస్తుంది కేవలం డబ్బు కోసం మాత్రమే కాదని, యాక్టర్ గా తనకు సంతృప్తినిచ్చే క్యారెక్టర్ల కోసమే తాను వెయిట్ చేశానని, కోర్టు సినిమాతో తనకు కొత్త లైఫ్ స్టార్ట్ అయిందని ఆయన రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
విక్రమ్ మూవీలో ఏజెంట్ టీనా, సరిపోదా శనివారం మూవీలో విలన్ పాత్రలు చూసినప్పుడు యాక్టర్ గా తనకెంతో సంతృప్తినిచ్చిందని, అలాంటి పాత్రలు తనకెలా వస్తాయనుకున్నా అని డబ్బే ఇంపార్టెంట్ అనుకుంటే రోజుకు నాలుగు సినిమాలు చేయొచ్చని, కానీ తాను మాత్రం తనకు సరిపోయే పాత్రల కోసం వెయిట్ చేశానని, మార్చి 14న కోర్టు మూవీతో తన కొత్త లైఫ్ స్టార్ట్ అయిందని ఆయన అన్నారు.
ఈ ఇంటర్వ్యూలో ఆయన తన దగ్గరికొచ్చిన ఓ స్క్రిప్ట్ గురించి కూడా మాట్లాడారు. కథ చాలా కొత్తగా అనిపించినప్పటికీ డైరెక్టర్ స్టోరీ చెప్పగానే తన పాత్రకు సంబంధించి రెండు కీలక విషయాలు చెప్పానని వాటి వల్ల సినిమాపై ఎఫెక్ట్ ఉంటుందని కూడా చెప్పానని, అయితే అది హీరోకు నచ్చకపోయుండొచ్చని అందుకే వాళ్లు మళ్లీ తనను కాంటాక్ట్ అవలేదని, తనకు కథ చెప్పిన సినిమా ఇంకా మొదలైనట్టు లేదని శివాజీ తెలిపారు. ఈ కోర్టు రూమ్ డ్రామాలో హీరోయిన్ తరుపు బంధువు పాత్రలో శివాజీ నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో శివాజీ నటనను అందరూ అభినందిస్తున్నారు.