చిన్న సినిమాల జాత‌ర మామూలుగా లేదే!

ఓ సారి ఆవివ‌రాల్లోకి వెళ్తే ఆది సాయికుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం 'ష‌ణ్ముఖ‌'.;

Update: 2025-03-17 07:53 GMT

స్టార్ హీరోల సినిమాల‌న్నీ ఆన్ సెట్స్ లో ఉండ‌టంతో? ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా యంగ్ హీరోల చిత్రాలే రిలీజ్ అవుతున్నాయి. థియేట్రిక‌ల్ రిలీజ్ నుంచి ఓటీటీలోనూ వాటి హ‌వానే న‌డుస్తోంది. ఈ వారం కూడా చిన్న సినిమాల‌దే హ‌వా. అలాగే మ‌రికొన్ని ఓటీటీ రిలీజ్ లు కూడా ఉన్నాయి. ఓ సారి ఆవివ‌రాల్లోకి వెళ్తే ఆది సాయికుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం 'ష‌ణ్ముఖ‌'. ఇదొక డివోషిన‌ల్ థ్రిల్ల‌ర్.

ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని కొత్త పాయింట్ తో ష‌ణ్ముగం సాప్ప‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే ట్రైల‌ర్ తో మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈనెల 21న రిలీజ్ అవుతందీ చిత్రం. అలాగే స‌ప్త‌గిరి ప్ర‌ధాన పాత్ర‌లో `పెళ్లికాని ప్ర‌సాద్` ని అభిలాష రెడ్డి తెర‌కెక్కించారు. పెళ్లి విష‌యంలో స‌వాళ్లు ఎదుర్కున్న ఓ యువ‌కుడి క‌థ‌. ఇందులో ప్రియాంక శ‌ర్మ హీరోయిన్. ఈ సినిమా కూడా ఇదే నెల 21 న రిలీజ్ అవుతుంది.

అలాగే కొత్త న‌టీన‌టుల‌తో సుప్రీత్ కృష్ణ తెర‌కెక్కించిన చిత్రం `టుక్ టుక్`. ఆటోని పోలివుండే మ్యూజిక‌ల్ ప‌వ‌ర్స్ క‌లిగిన స్కూట‌ర్ తో ముగ్గురు యువ‌కులు ఎలాంటి ప్ర‌యాణం చేసార‌న్న‌ది ఈ సినిమా క‌థ‌. ఈ సినిమా కూడా ఇదే నెల 21న రిలీజ్ అవుతుంది. `అన‌గ‌న‌గా అస్ట్రేలియాలో`, `ఆర్టిస్ట్`, అలాగే బాలీవుడ్ చిత్రం `పింక్ టూ ప‌ప్పీ` తెలుగులో `కిస్ కిస్ కిస్సిక్` టైటిల్ తో ఇదే నెల 21న రిలీజ్ అవుతున్నాయి.

అదే రోజున `ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం`, స‌లార్ : సీజ్ ఫైర్ చిత్రాలు రీ-రిలీజ్ అవుతున్నాయి. అగ్ర హీరోల సినిమాలేవి రిలీజ్ కు లేక‌పోవ‌డంతో థియేట‌ర్లు అన్ని సినిమాల‌కు స‌క్ర‌మంగా కుదిరాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే సినిమాకు మంచి క‌లెక్ష‌న్లు సాధించే అవ‌కాశం ఉంది. కంటెంట్ ఉంటే క‌టౌట్ తో ప‌నిలేకుండా ప్రేక్ష‌కుల‌కు చిత్రాల‌ని ఆద‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News