ఫ్లాప్ సినిమా కోసం ఓటీటీ దిగ్గజం అన్ని కోట్లు?
పెద్ద తెరపై ఫ్లాప్ గా మిగిలిన `ఎమర్జెన్సీ` ఓటీటీలో హోలీ పండుగ రోజున విడుదలైంది. మార్చి 14 నుంచి ఇది అందుబాటులోకి రాగా, తొలి 24 గంటల్లో ఏ స్థాయి ఆదరణ దక్కించుకుందో చూడాలన్న ఆసక్తి నెలకొంది.;
కొన్ని సినిమాలు థియేటర్లలో విఫలమై, బుల్లితెర లేదా ఓటీటీల్లో మెప్పిస్తున్నాయి. ఇటీవల ఇంటర్ స్టెల్లార్, సనమ్ తేరి కసమ్ రీరిలీజ్‌లో సంచలనం సృష్టించాయి. కానీ అలాంటి మ్యాజిక్ కంగన నటించిన `ఎమర్జెన్సీ` చేయగలదా? .. పెద్ద తెరపై ఫ్లాప్ గా మిగిలిన `ఎమర్జెన్సీ` ఓటీటీలో హోలీ పండుగ రోజున విడుదలైంది. మార్చి 14 నుంచి ఇది అందుబాటులోకి రాగా, తొలి 24 గంటల్లో ఏ స్థాయి ఆదరణ దక్కించుకుందో చూడాలన్న ఆసక్తి నెలకొంది.
ఆసక్తికరంగా పలు భారీ చిత్రాలను విడుదల చేసిన నెట్ ఫ్లిక్స్ కంగన `ఎమర్జెన్సీ`ని ఏకంగా 80కోట్లకు కొనుగోలు చేయడం గొప్పతనం. కానీ ఆ స్థాయిలో ఓటీటీలోను జనాదరణ దక్కించుకుంటుందా? అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కంగన భారత మొట్టమొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో అద్భుతంగా నటించింది. కానీ సినిమాని తెరకెక్కించిన విధానం అంత బాలేదని విమర్శలొచ్చాయి. అందుకే ఇప్పుడు ఓటీటీలో ఏ తీరుగా రాణించింది? అన్నది ఆసక్తిని కలిగిస్తోంది.
ఇందిరమ్మ పాలనలో ఎమర్జెన్సీ విధించిన కాలం అత్యంత కీలకమైనది. చరిత్రకెక్కిన అలాంటి ముఖ్య ఘట్టంపై సినిమా తీయాలనే ఆలోచన మంచిది. కంగన ఆలోచన గొప్పది. కానీ ఎమర్జెన్సీ చాలా నెగెటివిటీని మూటగట్టుకుంది. వాటన్నిటికీ భిన్నంగా ఎమర్జెన్సీ నెట్ ఫ్లిక్స్ ఆదరణలో మొదటి పది సినిమాల జాబితాలో చేరుతుందా? థియేటర్లలో విఫలమైనా, ఓటీటీలో అందుకు భిన్నంగా రాణిస్తుందా? అన్నది సస్పెన్స్ గా మారింది. కొన్ని వరస పరాజయాలతో డీలాపడిన కంగన ఇక ఎలాంటి భేషజాలు లేకుండా ఓటీటీ సిరీస్ లలో నటిస్తే బావుంటుందని కూడా కొందరు క్రిటిక్స్ సూచిస్తున్నారు. కానీ కంగన మొండి పట్టు వీడదు. ఇంకా పెద్ద తెర కోసం పోరాడుతోంది.