పొన్ మ్యాన్ టాక్ ఏంటి..?

డైరెక్టర్ గా యాక్టర్ గా బసిల్ జోసెఫ్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు . అతని విలక్షణత ఏ పాత్రకైనా సరిపోయే అతని ఫిజిక్ తో కొత్త కొత్త కథలు తెర మీదకు తెస్తున్నారు.;

Update: 2025-03-15 19:43 GMT

ఈమధ్య మలయాళ యాక్టర్ కం డైరెక్టర్ బసిల్ జోసెఫ్ టైం చాలా బాగుందని అనిపిస్తుంది. అందుకే ఈమధ్య ఎక్కడ చూసినా సరే ఆయన కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ఓటీటీల ద్వారా తన మలయాళ సినిమాలన్నీ కూడా తెలుగుతో పాటు ఇతర సౌత్ బాషల ఆడియన్స్ ని అలరిస్తున్నాయి. డైరెక్టర్ గా యాక్టర్ గా బసిల్ జోసెఫ్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు . అతని విలక్షణత ఏ పాత్రకైనా సరిపోయే అతని ఫిజిక్ తో కొత్త కొత్త కథలు తెర మీదకు తెస్తున్నారు. అలాంటి పంథాలోనే వచ్చిన కొత్త సినిమా పొన్ మ్యాన్.

ఇంతకీ ఈ పొన్ మ్యాన్ కథ ఏంటి అంటే.. పీపీ అజేశ్ (బసిల్ జోసెఫ్) ఒక జ్యువెలరీ సేల్స్ ఏజెంట్. ఎవరిదైనా పెళ్లి అంటే చాలు అలా అవసరం మేరకు నగలు ఇచ్చి వాటికి సరిపడా కట్న కానుకలు, చదివింపులు వస్తే వాటితో ఇచ్చిన నగలను జమ చేసుకుంటాడు. ముందే అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఐతే ఎప్పటిలానే స్టెఫీ (లిజోమోల్ జోసే) పెళ్లికి 25 సవర్ల బంగారు నగలు ఇచ్చిన అజేశ్ కి పెళ్లైన తర్వాత వచ్చిన కానుకలు లెక్కేస్తే ఇచ్చిన బంగారం విలువలో సగం మాత్రమే ఉంటాయి. ఐతే మిగిలిన డబ్బు బదులు నగలు ఇవ్వమని అడుగుతాడు కానీ ఇప్పుడు అప్పుడు అంటూ ఆ ఫ్యామిలీ నగలు తిరిగి ఇవ్వదు. ఈలోగా స్టెఫీ భర్త మరియానో (సాజిన్ గోపు)తో కాపుతానికి వెళ్తుంది. ఆ నగలను అజేశ్ ఎలా రాబట్టాడు.. ఆ టైం లో స్టెఫీ ఆమె భర్త మరియానో ఏం చేశారు అన్నది సినిమా కథ.

సరదాగా అనుకున్న కథలనే తెర మీదకు తెస్తే ఎలా ఉంటుందో మలయాళ మేకర్స్ ని చూస్తే తెలుస్తుంది. ఇలా కూడా సినిమా తీస్తారా అని అనుకునే కథే ఇది. ఐతే దాన్ని రెండు గంటల సినిమాగా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. డైరెక్టర్ జోతిశ్ శంకర్ చేసిన అటెంప్ట్ బాగుంది. సినిమా కూడా అంతా ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తూ వెళ్లింది. అక్కడక్కడ కాస్త ల్యాగ్ అనే ఫీలింగ్ వస్తుంది తప్ప సినిమాను నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

ఇప్పటికే తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరైన బసిల్ జోసెఫ్ ఈ సినిమాతో మరోసారి తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. సినిమాలో నటించిన మిగతా వారంతా కూడా పరిధి మేరకు నటించి మెప్పించారు. సాంకేతికంగా కూడా సినిమా కథ కథనాలకు తగినట్టుగానే బెస్ట్ ఇచ్చారు. జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న పొన్ మ్యాన్ సినిమా సగటు సినీ ప్రేక్షకుడు కోరుకునే ఫ్రెష్ నెస్ ఉంది. ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. ఐతే అక్కడక్కడ కాస్త అటు ఇటుగా ఉన్నా టైం పాస్ మూవీగా అనిపిస్తుంది.

Tags:    

Similar News