పొలిటిక‌ల్ ఎంట్రీపై నితిన్ ఏమ‌న్నారంటే!

నితిన్ సినిమాల‌కు ప‌వ‌న్ ముఖ్య అతిధిగా రావ‌డం...ప‌వ‌న్ సినిమాల‌కు నితిన్ కూడా ఆహ్వానించ‌డం వంటివి ఇప్ప‌టికే జ‌రిగాయి.;

Update: 2025-03-17 08:01 GMT

యూత్ స్టార్ నితిన్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు వీరాభిమాని అన్న సంగ‌తి తెలిసిందే. ఓ స్టార్ గా ప‌వ‌న్ ని నితిన్ ఎంత‌గానో అభిమానిస్తాడు. అత‌డి న‌ట‌న‌..ఫైట్లు..డాన్సులు అంటే ఎంతో ఇష్టం. అలాగే అత‌డి ఆశ‌యాలు..సిద్దాంతాలు అంటే? నితిన్ ఆక‌ర్షితుడ‌వుతుంటాడు. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రి మ‌ధ్య మంచి బాండింగ్ కూడా ఏర్ప‌డింది.

నితిన్ సినిమాల‌కు ప‌వ‌న్ ముఖ్య అతిధిగా రావ‌డం...ప‌వ‌న్ సినిమాల‌కు నితిన్ కూడా ఆహ్వానించ‌డం వంటివి ఇప్ప‌టికే జ‌రిగాయి. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీతో ఏపీలో డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు నెర‌వ‌ర్తిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితం కోరుకుంటున్నారు. ప్ర‌జ‌ల‌కు త‌న‌వంతుగా ఏదైనా సేవ చేయాలని త‌పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ఆశ‌యాల కోసం నితిన్ కూడా రాజ‌కీయాల్లోకి వ‌స్తాడా? అని చాలా కాలంగా ప్ర‌చారంలో జ‌రుగుతోంది.

అయితే ఈ విష‌యాన్ని ఇంత‌వ‌ర‌కూ నితిన్ దృష్టికి ఎవ‌రు తీసుకెళ్ల‌లేదు. తొలిసారి నితిన్ న‌టించిన `రాబిన్ హుడ్ ` ప్ర‌చారంలో భాగంగా రాజ‌కీయాల్లో కి వ‌చ్చే అవ‌కాశం ఏదైనా ఉందా? అని అడిగితే రాజ‌కీయాలంటే ఎలాంటి ఆస‌క్తి త‌న‌కు లేద‌ని తెలిపాడు. కేవ‌లం త‌న ఫ్యాష‌న్ అంతా సినిమాల మీద‌న‌నే....రాజ‌కీయాలు ఇప్పుడు గానీ, భ‌విష్య‌త్ లో గానీ చేయ‌బోయ‌న‌ని క్లారిటీ ఇచ్చేసారు.

దీంతో నితిన్ రాజ‌కీయాల్లోకి రాడు..కేవ‌లం సినిమా స్టార్ గా మాత్ర‌మే ప్రేక్ష‌కుల మ‌ధ్య‌లో ఉంటాడ‌ని తేలిపోయింది. నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి నిర్మాత అన్న సంగ‌తి తెలిసిందే. డిస్ట్రిబ్యూష‌న్ రంగం నుంచి నిర్మాత‌గా ప్ర‌మోట్ అయ్యారు. కొంత కాలంగా ఆ నిర్మాణ బాధ్య‌త‌ల‌న్నీ ఆయ‌న కుమార్తె, నితిన్ సోద‌రి చూసుకుంటున్నారు.

Tags:    

Similar News