అర్జున్ S/o వైజయంతి.. అసలు కథ ఇదన్నమాట!

మల్టీ జానర్ టచ్‌తో ఈ సినిమా విభిన్నమైన కథను మలిచినట్లు స్పష్టంగా తెలుస్తోంది.;

Update: 2025-03-17 07:59 GMT

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న అర్జున్ S/o వైజయంతి టీజర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఎమోషనల్ ఫీలింగ్, మదర్ సన్ రిలేషన్‌తోపాటు పవర్‌ఫుల్ యాక్షన్ మోడ్‌లో టీజర్ డిజైన్ చేయడం ప్రేక్షకులకు నచ్చింది. మల్టీ జానర్ టచ్‌తో ఈ సినిమా విభిన్నమైన కథను మలిచినట్లు స్పష్టంగా తెలుస్తోంది. టీజర్ రిసీవ్ అయిన విధంగా చూస్తే సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ఈ సినిమాకు యువ దర్శకుడు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తుండగా, బాలీవుడ్ స్టార్స్ సోహైల్ ఖాన్, సయీ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో అసలైన హైలైట్ నేషనల్ అవార్డు విన్నర్ విజయశాంతి కీలక పాత్రలో నటించడం. ఆమె గతంలో చేసిన ఎన్నో పవర్‌ఫుల్ సినిమాల్లో తరచుగా చర్చించుకునే సినిమా కర్తవ్యం. ఇప్పుడు అదే కోణంలో ఒక కొత్త ట్విస్ట్‌తో కథను డిజైన్ చేశారు.

విజయశాంతి గతంలో పోషించిన కర్తవ్యం మూవీకి లెజెండరీ స్టేటస్ ఉంది. ఒక ధైర్యసాహసాలు కలిగిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె నటన ఇప్పటికీ ఫ్యాన్స్ గుర్తుంచుకునేలా ఉంటుంది. ఇప్పుడు అర్జున్ S/o వైజయంతి లో ఆమె పాత్రకు అదే స్థాయిలో ప్రాధాన్యత ఉంటుంది. కథానాయకుడు కళ్యాణ్ రామ్ టీజర్ రిలీజ్ సందర్భంగా మాట్లాడుతూ, కర్తవ్యం సినిమాలోని విజయశాంతి పాత్రకు కొడుకు ఉంటే ఎలా ఉంటుందనే పాయింట్ ఆధారంగా ఈ కథను డెవలప్ చేశామని తెలిపారు.

కళ్యాణ్ రామ్ చెప్పినదాని ప్రకారం, ఈ సినిమాలో విజయశాంతి కుమారుడిగా కనిపించనున్నాడు. తల్లికొడుకు మధ్య ఎంతో ప్రేమ, అభిమానం ఉండగా, వారి సంబంధాన్ని దూరం చేసే సంఘటన ఏమిటనేది కథలో కీలకం కానుంది. "నేను నిజజీవితంలో కూడా విజయశాంతి గారిని ‘అమ్మ’ అని పిలుస్తాను" అని కళ్యాణ్ రామ్ చెప్పిన మాటలు సినిమా మీద ఆసక్తిని మరింత పెంచాయి.

అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ముప్పా వెంకయ్య చౌదరి, సునీల్ బాలుసు, అశోక్ వర్ధన్ ముప్పా, కళ్యాణ్ రామ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. టీజర్ చూస్తుంటే యాక్షన్, ఎమోషన్ కలబోసిన ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే విధంగా ఉంటుందనిపిస్తోంది. ఇక సమ్మర్ ను టార్గెట్ చేసిన మేకర్స్ విడుదల డేట్ కు సంబంధించి అధికారిక అనౌన్స్‌మెంట్ ను త్వరలోనే ఇవ్వనున్నారు.

Full View
Tags:    

Similar News