కోర్ట్ బాక్సాఫీస్.. మూడు రోజుల లెక్క ఎంతంటే?

ముఖ్యంగా యూఎస్ మార్కెట్‌లో సినిమా కేవలం మూడు రోజుల్లోనే 600K డాలర్లు దాటింది.;

Update: 2025-03-17 05:37 GMT

తెలుగు సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి ఒక సినిమా 'కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడి' బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కంటెంట్ ప్రధానంగా ఉండే సినిమాలు థియేటర్లలో ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం చాలా అరుదు. కానీ కోర్ట్ మాత్రం తనదైన స్టైల్లో అదిరిపోయే కలెక్షన్లతో ముందుకు దూసుకెళుతోంది.


ఇప్పటికే ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ. 24.40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అందులో తొలి రెండు రోజులు సాలిడ్ ఓపెనింగ్స్ అయితే, మూడో రోజు మాత్రం అద్భుతమైన నెంబర్స్ ను నమోదైంది. ఒక్క రోజులోనే రూ. 8.5 కోట్ల గ్రాస్ సాధించడం విశేషం. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఎమోషనల్ లాయర్, కొత్తదనంతో కూడిన కథనం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి.

ముఖ్యంగా యూఎస్ మార్కెట్‌లో సినిమా కేవలం మూడు రోజుల్లోనే 600K డాలర్లు దాటింది. ఇంతటి భారీ విజయానికి కారణం నాని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ నుంచి వచ్చిన నమ్మకమైన కంటెంట్. నిర్మాత ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను ఓ భిన్నమైన కోణంలో ప్రేక్షకులకు అందించగా, దర్శకుడు రామ్ జగదీష్ కథను తెరపై గొప్పగా ఆవిష్కరించాడు.

ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా, కంటెంట్ ఆధారంగా థియేట్రికల్ రన్‌ను మరింత బలంగా కొనసాగించనుంది. ఇకపోతే, ముందు నుంచే ట్రేడ్ వర్గాలు ఈ సినిమాపై మంచి అంచనాలు పెట్టుకున్నాయి. ఎందుకంటే, తెలుగు ఇండస్ట్రీలో ఇటువంటి కథాంశాలతో హిట్ సినిమాలు తక్కువే. ఈ నేపథ్యంలో కోర్ట్ విజయం మరింత ప్రత్యేకంగా మారింది. ఇప్పటికే కేవలం మూడు రోజుల్లోనే హాఫ్ మిలియన్ మార్క్‌ను దాటిన ఈ సినిమా, త్వరలోనే మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరే అవకాశముంది.

మొత్తానికి కోర్ట్ సినిమా కంటెంట్ బేస్డ్ సినిమాలకు భారీ వసూళ్లు సాధించే బాటను చూపించింది. థియేటర్లలో అడుగు పెట్టిన ప్రతి ప్రేక్షకుడు సినిమా గురించి మంచి రివ్యూలు ఇస్తుండటంతో, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం ఇంకా కొనసాగనుంది. వారం ముగిసేలోపు మరింత భారీ కలెక్షన్లు రాబట్టే ఛాన్స్ ఉన్న ఈ సినిమా, ఇప్పటివరకు నాని బ్యానర్‌లో వచ్చిన సినిమాల్లోనే అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశం కనిపిస్తోంది.

Tags:    

Similar News