మ‌రో గొప్ప ప‌నికి పూనుకున్న మ‌హేష్ బాబు.. చిన్న పిల్ల‌ల కోసం మ‌ద‌ర్ మిల్క్ బ్యాంకు

ఎన్నో ఏళ్లుగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు చిన్న పిల్ల‌ల‌కు గుండె ఆప‌రేష‌న్లు చేయిస్తూ ఆయ‌న గొప్ప‌త‌నాన్ని చాటుకుంటూనే ఉన్నాడు.;

Update: 2025-03-17 05:38 GMT

ఎన్నో ఏళ్లుగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు చిన్న పిల్ల‌ల‌కు గుండె ఆప‌రేష‌న్లు చేయిస్తూ ఆయ‌న గొప్ప‌త‌నాన్ని చాటుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు మ‌హేష్ బాబు, ఆయ‌న భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్ పిల్ల‌ల కోసం మ‌రో గొప్ప పని చేయ‌డానికి పూనుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

అందులో భాగంగానే న‌మ్ర‌త విజ‌య‌వాడ‌లోని ఆంధ్రా హాస్పిట‌ల్స్ తో క‌లిసి తాము ఏర్పాటు చేసిన మ‌ద‌ర్స్ మిల్క్ బ్యాంకును ప్రారంభించి, దాని గురించి వివరించారు. ఈ ప్రాజెక్టులో పిల్ల‌ల ఆరోగ్య సంర‌క్ష‌ణకు పెద్ద పీట వేయ‌నున్న‌ట్టు ఆమె తెలిపారు. త‌ల్లి పాలు త‌క్కువ ఉన్న వారికి, త‌క్కువ బ‌రువుతో పుట్టిన వారికి ఈ మిల్క్ బ్యాంకు ద్వారా పాలు అందిస్తామ‌ని ఆమె తెలిపారు.

పాలు ఎక్కువ‌గా ఉన్న త‌ల్లుల నుంచి పాల‌ను సేక‌రించి త‌ల్లిపాలు అంద‌ని పిల్ల‌ల‌కు వాటిని ఇవ్వ‌నున్న‌ట్టు ఆమె త‌లిపారు. త‌ల్లి పాల వ‌ల్ల పిల్ల‌ల‌కు రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డంతో పాటూ ఎలాంటి ఇన్ఫెక్ష‌న్ల‌కు గురి కాకుండా ఉంటార‌ని, పిల్ల‌ల‌కు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండ‌టానికి త‌ల్లి పాలు ఎంతో అవ‌స‌ర‌మ‌ని న‌మ్ర‌త ఈ సంద‌ర్భంగా తెలిపారు.

మ‌ద‌ర్ మిల్క్ బ్యాంక్ తో పాటూ గ‌ర్బాశయ క్యాన్స‌ర్ కు వ్యాక్తిన్ కార్య‌క్ర‌మాన్ని కూడా తాము ప్రారంభిస్తున్న‌ట్టు న‌మ‌త్ర ఈ సంద‌ర్భంగా తెలిపారు. ఈ రోజుల్లో గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ చాలా తీవ్ర స‌మ‌స్య‌గా మిగిలిపోయింద‌ని, స‌రైన టైమ్ లో దానికి వ్యాక్సిన్ తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చ‌ని న‌మ‌త్ర అన్నారు.

అందుకే 9 నుంచి 18 సంవ‌త్స‌రాల లోపున్న అమ్మాయిల‌కు ఈ వ్యాక్సిన్ ను అందించాల‌నుకుంటున్నామ‌ని, 2025 ఆఖ‌రికి 1500 మంది బాలిక‌ల‌కు టీకాలు వేయ‌డంతో పాటూ గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ పై అవ‌గాహ‌న పెంచ‌డ‌మే ల‌క్ష్యంగా త‌మ టీమ్ ప‌ని చేయ‌నున్నట్టు న‌మ్ర‌త చెప్పారు. మ‌హేష్ చేసే ఇలాంటి సామాజిక ప‌నులే ఆయ‌న్ని మిగిలిన హీరోల నుంచి భిన్నంగా నిల‌బెడుతుంది. మ‌హేష్ చేస్తున్న ఈ స‌మాజ సేవ‌కు ప్ర‌తీ ఒక్క‌రూ ఆయ‌న్ని అభినందిస్తున్నారు.

Tags:    

Similar News