హీరోయిన్లకు పెరుగుతోంది ప్రాధాన్యత!
ఒకప్పుడు సినిమాలో హీరోయిన్ అంటే నాలుగు పాటలకు..రొమాంటిక్ సన్నివేశాలకు మాత్రమే పరిమితం అయ్యేవారు.;
ఒకప్పుడు సినిమాలో హీరోయిన్ అంటే నాలుగు పాటలకు..రొమాంటిక్ సన్నివేశాలకు మాత్రమే పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పుడు నటీమణలు విషయంలో ట్రెండ్ మారింది. నవతరం దర్శకులు హీరోలతో పాటు హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. స్టోరీ సిద్దం చేసుకునే సమయంలో బలమైన కంటెంట్ రాయడంతో? సినిమాలో హీరోల పాత్రలతో పాటు కథను మలుపు తిప్పే కొత్త పాత్రలు కూడా యాడ్ అవ్వడంతో? హీరోయిన్ పాత్రలకు ప్రాధన్యత పెరుగుతుంది.
ఇప్పటి హీరోయిన్లు కూడా మనసుకు నచ్చితేనే వాటిలో నటిస్తున్నారు. లేదంటే నిర్మొహమాటంగా చెప్పే స్తున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్లను ఒప్పించడం కూడా దర్శకులకు కొన్ని సందర్భాల్లో కష్టంగా మారు తుంది. ఇటీవలే సాయిపల్లవిని తండేల్ లో బుజ్జితల్లి లాంటి బ్యూటీఫుల్ పాత్రకు ఒప్పించడం కోసం తానెంతగా కష్టపడాల్సి వచ్చిందని చెప్పాడు. అప్పటి వరకూ సాయి పల్లవి పాత్రల విషయంలో మరీ అంత సెలక్టివ్ గా ఉంటుందా? అన్న సందేహం కలగ మానదు.
ఇకపై సాయిపల్లవితో సినిమా చేయాలంటే? డైరెక్టర్ ఆమె పాత్రని ఎంత బలంగా రాయాలి? అన్న దానిపై ఓ ఐడియా ఉంటుంది. ఆ రకమైన స్ట్రాటజీతో వెళ్తేనే ఆమెను ఒప్పించగలం అన్న నమ్మకం ఉంటుంది. మరో తెలుగమ్మాయి రీతూ వర్మ కూడా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ డీసెంట్ రోల్స్ మాత్రమే చేస్తుంటుంది. ఈమెను కూడా పాత్ర విషయంలో ఒప్పించడం అంత సులభం కాదని అంటుంటారు.
సంయుక్తా మీనన్, కీర్తీ సురేష్, రష్మికా మందన్నా లాంటి వాళ్లు పాత్రల విషయంలో పుల్ క్లారిటీ తో ఉంటారు. కొన్ని చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న భామలు సైతం అంతే పట్టు మీద ఉంటున్నారు. కీలక పాత్రలతో ఫేమస్ అయినా హీరోయిన్ ఛాన్స్ వచ్చినా? అందులో ప్రాధాన్యత లేకపోతే హీరోయిన్ అవ కాశాన్ని వదులుకునేది మరికొంత మంది.