మరోసారి శర్వాతో అనుపమ
తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్లలో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు.;
తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్లలో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. అ..ఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుపమ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. శతమానం భవతి సినిమాతో పక్కింటి అమ్మాయి పేరును సంపాదించుకుంది అనుపమ.
శర్వానంద్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శర్వానంద్, అనుపమ మధ్య వచ్చిన సీన్స్ ప్రేక్షకుల హృదయాల్ని కట్టిపడేశాయి. శతమానం భవతిలో శర్వా- అనుపమ కెమిస్ట్రీ చాలా బాగా వర్కవుటైంది. 2017లో వచ్చిన ఆ సినిమా తర్వాత అనుపమ పలు సినిమాల్లో నటించింది కానీ శర్వానంద్ తో మళ్లీ కలిసి సినిమా చేయలేదు.
వీరిద్దరి జంట ఆన్ స్క్రీన్ పై చూసిన వారంతా ఎప్పుడెప్పుడు వీరిద్దరూ కలిసి నటిస్తారా అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఈ జంట ఇన్నేళ్లకు కలిసి నటించబోతున్నట్టు తెలుస్తోంది. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేశారని సమాచారం. రీసెంట్ గానే చిత్ర బృందం ఈ విషయమై అనుపమని కలిసినట్టు తెలుస్తోంది. అనుపమ కూడా ఈ సినిమా చేయడానికి సుముఖుంగానే ఉందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వీలుంది.
రీసెంట్ గా అనుపమ నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అనుపమ చిన్న పాత్రలోనే కనిపించినప్పటికీ తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. దీంతో టాలీవుడ్ ఫోకస్ మొత్తం మళ్లీ అనుపమ వైపు మళ్లింది. ప్రస్తుతం నారీ నారీ నడుమ మురారీ సినిమాతో పాటూ అభిలాష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న శర్వా, త్వరలోనే సంపత్ సినిమాను మొదలుపెట్టనున్నాడు.