‘హిట్ 3’.. నాని గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు!

నాని హీరోగా నటించనున్న ‘హిట్ 3’ సినిమా గురించి రోజుకో కొత్త అప్డేట్ బయటికి వస్తోంది.;

Update: 2025-03-16 21:30 GMT

నాని హీరోగా నటించనున్న ‘హిట్ 3’ సినిమా గురించి రోజుకో కొత్త అప్డేట్ బయటికి వస్తోంది. మొదటి రెండు భాగాల్లో వరుసగా విశ్వక్ సేన్, అడివి శేష్‌లు లీడ్ రోల్స్ చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో.. ఇప్పుడు నాని మెయిన్ లీడ్‌గా వస్తుండటం సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇదే సర్‌ప్రైజ్‌కు తోడు.. ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన నటుడిని తీసుకొచ్చినట్టు సమాచారం. సినిమా కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా.. పాన్ ఇండియా రేంజ్‌లో ఆకట్టుకునేలా ఉండబోతోందట.

దర్శకుడు శైలేష్ కొలను ఈసారి కథను మరింత విస్తృతంగా అందరికి కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేశారని సమాచారం. కాశ్మీర్ నుంచి బీహార్ వరకు విస్తరించిన కథాంశంతో, ఇండియా మొత్తం తిరిగే ప్లాన్‌లో ఉన్నట్లు టాక్. ఇందులో హిందీలోనే మాట్లాడే ఒక క్యారెక్టర్ కాస్త హైలెట్ అవుతుందట. ఇక అందుకు అవసరమయ్యే క్యారెక్టర్‌కు ఒక ప్రముఖ నటుడిని తీసుకున్నారట. అతను మరెవరో కాదు, ‘సూపర్ బాయ్స్ ఆఫ్ మలేగావ్’ ఫేమ్ సాకిబ్ అయూబ్ అని తెలుస్తోంది.

నానికి ఏ క్యారెక్టర్ కోసం ఏం కావాలో స్పష్టంగా తెలుసు. అందుకే తన వాయిస్, యాక్టింగ్ పరంగా బాగా కనెక్ట్ అయ్యేలా చేసినట్టు చెబుతున్నారు. సినిమా ప్రీ ప్రొడక్షన్ సమయంలోనే సాకిబ్‌ను ఈ పాత్రకు తీసుకోవాలని నాని డిసైడ్ అయ్యాడట. మొదటిసారి నానితో కలిసి పనిచేసే అవకాశం రావడంతో, సాకిబ్ ఆశ్చర్యపోయాడట. కానీ షూటింగ్ మొదలైన తర్వాత ఆయన నాని వర్కింగ్ స్టైల్, పర్ఫెక్షన్ చూసి నానికి అంతం రిస్పెక్ట్ ఎందుకు ఇస్తారో అర్థమైందని అంటున్నాడు. సినిమా పాన్ ఇండియా లెవల్లో నిర్మించబోతుండటంతో.. ఇందులోని పాత్రలకు మరింత ప్రాముఖ్యత పెరిగిందట.

‘హిట్ 3’లో నాని చేసే పాత్రలో భారీ యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయని టాక్. ఇదివరకు వచ్చిన రెండు పార్ట్స్‌లోనూ డిటెక్టివ్ థ్రిల్లర్ టోన్ ఎక్కువగా ఉండగా.. ఈసారి మాత్రం స్టోరీ మలుపులు మరింత థ్రిల్లింగ్‌గా ఉండబోతున్నాయి. పైగా గత సినిమాల కంటే స్క్రీన్‌ప్లేలో ఇన్వెస్టిగేషన్‌ను మళ్లీ కొత్తగా ట్రై చేసినట్టు తెలుస్తోంది. హిందీ బాషా నేపథ్యంతో కూడిన క్యారెక్టర్ కావడం వల్ల సాకిబ్ ఈ సినిమా కోసం స్పెషల్‌గా వాయిస్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడట.

ఇక నాని ‘హిట్ 3’కి మాత్రమే కాదు, ఈ ఫ్రాంచైజీకి నిర్మాతగా ఉండడం అతనికి స్పెషల్ క్రెడిట్ తెచ్చిపెట్టింది. గతంలో వచ్చిన రెండు భాగాలూ నాని బ్యానర్‌లోనే వచ్చాయి. కానీ ఈసారి మూడో పార్ట్‌లోనే మెయిన్ లీడ్‌గా నటిస్తూ మరో ప్రయోగం చేస్తున్నాడు. ఇది కచ్చితంగా సినిమాకు మరింత బలం ఇవ్వబోతుంది. థ్రిల్లర్ జానర్‌కు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యాన్ని నాని ఎలాగైనా మరింత ప్రామాణికంగా ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా 2025లో విడుదల కానుంది. అందులోనూ హిట్ ఫ్రాంచైజీ గత రెండు సినిమాలకు బాగా పేరు రావడం, టెక్నికల్ వాల్యూస్ పరంగా చాలా హై స్టాండర్డ్స్‌లో ఉండటంతో ‘హిట్ 3’పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి, నాని ప్రధాన పాత్రలో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News