కిరణ్ అబ్బవరం.. ఇకపై కొత్త దారిలో..

సినిమా పరిశ్రమలో బిగ్ హిట్ కొట్టిన హీరోలు వెంటనే అదే ఫార్ములాను ఫాలో అవుతారు. కానీ కిరణ్ అబ్బవరం మాత్రం అందరికంటే భిన్నంగా ముందుకు సాగుతున్నాడు.;

Update: 2025-03-16 18:51 GMT

సినిమా పరిశ్రమలో బిగ్ హిట్ కొట్టిన హీరోలు వెంటనే అదే ఫార్ములాను ఫాలో అవుతారు. కానీ కిరణ్ అబ్బవరం మాత్రం అందరికంటే భిన్నంగా ముందుకు సాగుతున్నాడు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో, వరుస సినిమాలతో బిజీగా మారాడు. కానీ కొన్ని సినిమాలు నిరాశపరిచినా, అతను తన కెరీర్‌ను మెల్లగా నిర్మించుకుంటూ వచ్చాడు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన దిల్ రూబా సినిమా మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నా, కిరణ్ తీసుకున్న ఓ నిర్ణయం అందరికీ ఆసక్తికరంగా మారింది.

చాలామంది యువ హీరోలు రెమ్యునరేషన్ కోసమే పరుగులు తీస్తున్న తరుణంలో, కిరణ్ మాత్రం జనాలకు కనెక్ట్ అయ్యేలా మంచి ఇమేజ్ పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాడు. అసలు దిల్ రూబా సినిమా కంటే ముందే రిలీజ్ కావాల్సింది. కానీ కథపై కాస్త డౌట్ ఉండటంతో ముందుగా క సినిమాను రిలీజ్ చేసి, ఆ తర్వాత దిల్ రూబాని తెరపైకి తీసుకురావాలని నిర్ణయించాడు. క బ్లాక్‌బస్టర్ కావడంతో, దాని సక్సెస్ వేవ్‌పై దిల్ రూబా ఓపెనింగ్స్ కూడా మెరుగయ్యాయి. ఇది కిరణ్ అబ్బవరం తీసుకున్న తెలివైన నిర్ణయమే అని పరిశ్రమలో చర్చ నడుస్తోంది.

సినిమా బిజినెస్ పరంగా చూస్తే, కిరణ్ నిర్ణయం ఎంతో లాభదాయకంగా మారింది. దిల్ రూబా ముందు విడుదల చేసి ఉంటే, పెద్దగా మార్కెట్ ఏర్పడేది కాదు. కానీ క హిట్ తర్వాత వచ్చిన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ దక్కించుకుంది. ముఖ్యంగా యూత్‌లో సినిమా తనదైన మార్క్ వేసుకుంది. పైగా ఈ సినిమా విడుదల హక్కులు సారేగమా సంస్థ తీసుకోవడంతో, నిర్మాతలకు లాభమే మిగిలింది. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ కూడా వృద్ధి చెందుతున్న తరుణంలో, థియేటర్ పరంగా మిశ్రమ స్పందన వచ్చినా, ఓటీటీలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకోవచ్చు.

ఇకపై కిరణ్ అబ్బవరం కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించనున్నాడని టాక్. ఇప్పటివరకు అతను చేసిన కొన్ని సినిమాలు ప్రయోగాత్మకంగా ఉన్నప్పటికీ, అందులో కొన్ని ఎగ్జిక్యూషన్ పరంగా మెరుగైన ఫలితం రాలేదు. అయితే ఈసారి మాత్రం కథల విషయంలో కాంప్రమైజ్ చేయకుండా, కంటెంట్ బలంగా ఉండే సినిమాలను మాత్రమే చేస్తాననే క్లారిటీకి వచ్చాడట. ప్రస్తుతం కిరణ్ చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయని తెలుస్తోంది. వీటిలో K ర్యాంప్ సినిమా పూర్తి కావొస్తుండగా, మరో మూడు సినిమాల స్క్రిప్ట్ పనులు కొనసాగుతున్నాయి.

కేవలం హీరోగా మాత్రమే కాకుండా, కిరణ్ అబ్బవరం ఇప్పుడు మార్కెట్‌ను అర్థం చేసుకుని తాను ఉన్న లెవల్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇంతకుముందు వరుస సినిమాలతో తనను తాను బిజీగా ఉంచుకున్న ఈ యంగ్ హీరో, ఇప్పుడు మాత్రం క్వాలిటీ మీద ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. కిరణ్ ఈ నిర్ణయంతో ఇకపై మరింత పవర్ఫుల్ కథలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని సినీ వర్గాలు విశ్వసిస్తున్నాయి.

Tags:    

Similar News