వీర‌మ‌ల్లు త‌ర్వాత జ్యోతికృష్ణ అత‌డితోనా!

జ్యోతికృష్ణ నిర్మాత ఏ.ఏం ర‌త్నం త‌న‌యుడిగా ఫేమ‌స్ అయ్యాడు త‌ప్ప డైరెక్ట‌ర్ గా ఇంకా ఫేమ‌స్ కాలేదు.;

Update: 2025-03-16 19:30 GMT

జ్యోతికృష్ణ నిర్మాత ఏ.ఏం ర‌త్నం త‌న‌యుడిగా ఫేమ‌స్ అయ్యాడు త‌ప్ప డైరెక్ట‌ర్ గా ఇంకా ఫేమ‌స్ కాలేదు. త‌మిళ్ లో మూడు సినిమాలు చేసాడు. తెలుగులో `ఆక్సిజ‌న్`, `రూల్స్ రంజ‌న్` సినిమాలు చేసాడు. రెండు కూడా పెద్ద‌గా స‌క్సెస్ అవ్వ‌లేదు. ఆ త‌ర్వాత జ్యోతికృష్ణ పేరు ఏడాది కాలంగా గ‌ట్టిగా వినిపిస్తుంది. `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` నుంచి క్రిష్ త‌ప్పుకోవ‌డంతో ఆ బాధ్య‌త‌లు జ్యోతికృష్ణ తీసుకుని లైన్ లోకి వ‌చ్చాడు.

అప్ప‌టి నుంచి జ్యోతికృష్ణ వైర‌ల్ గా మారాడు. ఈ సినిమా జ్యోతి కృష్ణ కెరీర్ కీల‌క‌మైందే. వీర‌మ‌ల్లు హిట్ అయి తే ద‌ర్శ‌కుడిగా మంచి పేరొస్తుంది. పీరియాడిక్ సినిమా డీల్ చేయ‌డంలో త‌న స్పెషాల్టీ చూపించ గ‌ల్గితే? మ‌రో రాజ‌మౌళి గానే ఫేమ‌స్ అవుతాడు. డైరెక్ట‌ర్ గా స్టార్ లీగ్ లో చేర‌డానికి అతి స‌మీపంలోనూ ఉండిన‌ట్లు అవుతుంది. మ‌రి అది జ‌రుగుతుందా? లేదా? అన్న‌ది చూడాలి.

అయితే జ్యోతికృష్ణ‌కు టాలీవుడ్ లో మ‌రో హీరో అవ‌కాశం ఇచ్చిన‌ట్లు స‌మాచారం. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడుట‌. రెండు నెల‌ల క్రితం జ్యోతికృష్ణ క‌ళ్యాణ్ రామ్ కి ఓ పోలీస్ స్టోరీ చెప్పాడుట‌. న‌చ్చ‌డంతో ఆయ‌న కూడా ఒకే చెప్పిన‌ట్లు తెలిసింది. క‌ళ్యాణ్ రామ్ త‌దుప‌రి చిత్రంగా ఇదే ప‌ట్టాలెక్కుతుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ రామ్ `అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి` చిత్రంలో న‌టిస్తున్నాడు.

సెట్స్ లో ఉందీ చిత్రం. పూర్త‌వ్వ‌డానికి ఇంకొంత స‌మ‌యం ప‌డుతుంది. అటు జ్యోతికృష్ణ కూడా వీర‌మ‌ల్లు ప‌నుల్లో ఉన్నాడు. షూటింగ్ పూర్త‌యిన వ‌ర‌కూ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కూడా జ‌రుగుతోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ డేట్లు ఇస్తే పెండింగ్ షూటింగ్ కూడా పూర్తి చేసి ప్రీ అవ్వాల‌ని చూస్తున్నాడు.

Tags:    

Similar News