మరణ మాస్ ఇది వేరే లెవెల్..!
మలయాళ నటుడు, దర్శకుడు బసిల్ జోసెఫ్ సినిమా అంటే చాలు ఆడియన్స్ అంతా అటెన్షన్ చూపిస్తున్నారు. రీసెంట్ గా పొన్ మ్యాన్ తో ప్రేక్షకులను అలరించిన బసిల్ జోసెఫ్ తన కొత్త సినిమా మరణ మాస్ తో సర్ ప్రైజ్ చేశాడు.;
మలయాళ నటుడు, దర్శకుడు బసిల్ జోసెఫ్ సినిమా అంటే చాలు ఆడియన్స్ అంతా అటెన్షన్ చూపిస్తున్నారు. రీసెంట్ గా పొన్ మ్యాన్ తో ప్రేక్షకులను అలరించిన బసిల్ జోసెఫ్ తన కొత్త సినిమా మరణ మాస్ తో సర్ ప్రైజ్ చేశాడు. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా మేకర్స్ ప్లానింగ్ ఒక రేంజ్ లో ఉందని తెలుస్తుంది. ఒక సినిమా ఆడియన్ కు రీచ్ అవ్వాలంటే అది ప్రమోషన్స్ లోనే ఉందని తెలిసిందే. టాలీవుడ్ మేకర్స్ ఈ విషయాన్ని ఎప్పుడో కనిపెట్టారు. ఐతే ఇప్పుడు మరణ మాస్ కోసం మలయాళ మేకర్స్ కూడా ఇలానే ట్రై చేస్తున్నారు.
ఈమధ్య ఎక్కడ చూసినా సరే బసిల్ జోసెఫ్ సినిమాలు సందడి చేస్తున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న బసిల్ జోసెఫ్ డైరెక్టర్ గా యాక్టర్ గా అదరగొట్టేస్తున్నాడు. ఈ క్రమంలో కొత్త సినిమా మరణ్ మాస్ తో సర్ ప్రైజ్ చేశాడు బసిల్ జోసెఫ్. ఈ సినిమాను శివ ప్రసాద్ డైరెక్ట్ చేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే బసిల్ జోసెఫ్ డైరెక్షన్ లో వచ్చిన మిన్నల్ మురళి సినిమాకు అసిస్టెంట్ గా పనిచేసిన శివ ప్రసాద్ ఇప్పుడు అతను డైరెక్టర్ గా మారి బసిల్ ని డైరెక్ట్ చేస్తున్నాడు.
మరణ మాస్ ప్రమోషనల్ వీడియో కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. డార్క్ హ్యూమర్ గా వస్తున్న ఈ సినిమాపై ఈ టీజర్ తోనే అంచనాలు పెంచారు. అంతేకాదు ఈ సినిమాను మలయాళ హీరో టోవినో థామస్ బ్రదర్స్ నిర్మిస్తునారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
బసిల్ జోసెఫ్ ఏ సినిమా చేసినా అందులో ఏదో ఒక కొత్తదనం ఉంటుందని ఫిక్స్ అయ్యారు ప్రేక్షకులు. అతను చేస్తున్న వరుస సినిమాలు చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. ఐతే ఈ మరణ మాస్ సినిమా బసిల్ సినిమాలకు భిన్నంగా ఉండేలా ఉంది. మరణ మాస్ కేవలం మలయాళ ఆడియన్స్ నే అలరిస్తుందా లేదా బసిల్ సినిమాలు ఇష్టపడే సౌత్ ఆడియన్స్ కి కూడా రీచ్ అవుతుందా అన్నది చూడాలి.
ఏం చేసినా ఎలా చేసినా ఫైనల్ గా ఆడియన్స్ ని మెప్పించడమే లక్ష్యంగా బసిల్ జోసెఫ్ సినిమాలు వస్తున్నాయి. ఐతే ఈమధ్య అతను చేసిన కొన్ని క్రైం సినిమాలు మాత్రం సంథింగ్ స్పెషల్ గా క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.