పెళ్లిలో ముగ్గురు భార్య‌ల‌తో స్టార్ హీరో త‌కిదిమితోం

ప్ర‌స్తుతం అమీర్ మూడో భార్య గురించి ఇంట‌ర్నెట్ లో విప‌రీత‌మైన చ‌ర్చ సాగుతుండ‌గానే, వీటన్నిటి మధ్య అత‌డు త‌న ముగ్గురు భార్య‌ల‌తో పెళ్లిలో ప్ర‌త్య‌క్ష‌మై ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.;

Update: 2025-03-15 20:30 GMT

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమీర్ ఖాన్ ఇటీవ‌లే త‌న మూడో భార్య‌ను మీడియాకు ప‌రిచ‌యం చేసారు. త‌న సంస్థానంలో ప‌ని చేసే గౌరీ స్ప్రాట్ అనే పెళ్ల‌యిన యువ‌తితో డేటింగ్ చేస్తున్న విష‌యాన్ని క‌న్ఫామ్ చేసాడు. అమీర్ కు 25 సంవత్సరాలుగా గౌరీ తెలుసు. అయితే ఏడాదికి పైగా వారి మ‌ధ్య‌ డేటింగ్ న‌డుస్తోంది.

ప్ర‌స్తుతం అమీర్ మూడో భార్య గురించి ఇంట‌ర్నెట్ లో విప‌రీత‌మైన చ‌ర్చ సాగుతుండ‌గానే, వీటన్నిటి మధ్య అత‌డు త‌న ముగ్గురు భార్య‌ల‌తో పెళ్లిలో ప్ర‌త్య‌క్ష‌మై ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఇటీవల అంద‌రికీ ప‌రిచ‌యం చేసిన‌ తన కొత్త స్నేహితురాలు గౌరీ, అతడి మాజీ భార్యలు కిరణ్ రావు, రీనా దత్తాలతో కలిసి ఓ సెల‌బ్రిటీ పెళ్లి కార్యక్రమంలో కనిపించారు. వారంతా క్రికెట‌ర్ ఇర్ఫాన్ పఠాన్ వివాహ వార్షికోత్సవ వేడుకకు హాజరయ్యారు. భార్య‌ల‌తో అమీర్ కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒక యూజర్ ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేయ‌గా అది జోరుగా వైర‌ల్ అయింది. ప్రజలు దానిపై వేగంగా స్పందించారు. అమీర్ అతడి మాజీ భార్యలు, అతడి ప్రస్తుత స్నేహితురాలు ఒకే గదిలో ఎలా కలిసి మెలిసి ఉన్నారో చూస్తుంటే, న‌మ్మ‌శ‌క్యంగా లేదు. దీనిని నిజ‌మా క‌లా? అంటూ.. చాలామంది నమ్మలేదు. భార్య‌లంతా కలిసి సంతోషంగా ఫోటో కోసం పోజులిచ్చారు. ఈ వైరల్ వీడియోలో ఇర్ఫాన్ పఠాన్ కూడా అమీర్ కు కేక్ తినిపిస్తూ కనిపించాడు.

ఆహా భార్య‌ల ప్రేమ అంటే ఇలా ఉండాలి! అంటూ కొంద‌రు అమీర్ స‌హ‌చ‌రిణుల గురించి వ్యాఖ్యానించారు. అత‌డు ఇలాంటివి ఎలా చేస్తాడో నాకు నిజంగా తెలుసుకోవాలని ఉంది! అని వ్యాఖ్యానించారు. మీరు విషపూరితం కాకపోతే మీ మాజీలతో స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకోవ‌డాన్ని నేను అర్థం చేసుకున్నాను.. కానీ అది కుటుంబానికి సంబంధించిన కార్యక్రమం కానప్పుడు వారంతా ఒకే చోట కలిసి క‌నిపించ‌టం భయంకరంగా ఉంది.. అని రాసాడు. వారంతా మాజీలు అయినా బ‌ల‌మైన వ్య‌క్తిత్వంతో ఆనందంగా గ‌డిపేందుకు సిద్ధంగా ఉండే భార్య‌లు అని కూడా ఒక‌రు ప్ర‌శంసించారు.

Tags:    

Similar News