మహేష్- రాజమౌళితో పీసీ హోలీ సెలబ్రేషన్ ?
ఈసారి మహేష్- ఎస్ఎస్ రాజమౌళితో కలిసి తన తదుపరి సినిమా కోసం పీసీ హైదరాబాద్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఎస్.ఎస్.ఎం.బి 29 సెట్స్‌లో రంగుల పండుగను జరుపుకుంది.;
బాలీవుడ్ తనను వెలివేసిందని బహిరంగంగా ప్రకటించింది ప్రియాంక చోప్రా. బాలీవుడ్ లో కొందరు తనను దూరం పెట్టారని వాపోయింది. దాని వల్లనే తాను హాలీవుడ్ కి వెళ్లిపోయానని వ్యాఖ్యానించింది. హాలీవుడ్ లో కొన్నేళ్లుగా కెరీర్ ని సాగిస్తోంది. ఇటీవలే సిటాడెల్ సీజన్ 2లో కూడా నటించింది.
చాలా కాలం తర్వాత ప్రియాంక చోప్రా హోలీ సందర్భంగా భారతదేశంలో ఉన్నారు. ఈసారి మహేష్- ఎస్ఎస్ రాజమౌళితో కలిసి తన తదుపరి సినిమా కోసం పీసీ హైదరాబాద్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఎస్.ఎస్.ఎం.బి 29 సెట్స్‌లో రంగుల పండుగను జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను పీసీ ఇన్ స్టాలో షేర్ చేయగా వైరల్ గా మారాయి. హోలీ సందర్భంగా తన బుగ్గపై రంగులు అద్దిన ఓ ప్రత్యేకమైన ఫోటో వైరల్ గా మారింది. ప్రియమైన వారితో హోలీ జరుపుకోవడం ఆనందంగా ఉందని వ్యాఖ్యను జోడించింది.
జనవరిలో రాజమౌళి తన ఇన్‌స్టాలో ఒక వీడియోను షేర్ చేశాడు. సింహాన్ని బోనులో బంధించాను (మహేష్ బాబును సూచిస్తూ) అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. మహేష్ పాస్‌పోర్ట్ కూడా లాక్కున్నాడు. ఇక సినిమా షూటింగ్ తో బంధించానని అన్నాడు. మొత్తానికి మహేష్ తో భారీ చిత్రం మొదలైందని స్పష్ఠత వచ్చింది. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ మహేష్ కూడా పోకిరీలా దూకుడు ప్రదర్శించాడు.
ప్రియాంక చోప్రా కూడా ఈ ప్రాజెక్ట్‌లో చేరుతోందని కూడా హింట్ అందింది. ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి.... మహేష్ తో భారీ పాన్ వరల్డ్ సినిమాకి తెర లేపారు. ఇది అడవి నేపథ్యంలో ఇండియానా జోన్స్ లాంటి యాక్షన్ అడ్వెంచర్ అని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం అధికారికంగా హైదరాబాద్‌లో పూజా వేడుకతో ప్రారంభమైంది. ఈ వేడుక నుంచి మహేష్ లుక్స్ ఏవీ రిలీజ్ కాలేదు. మహేష్ లుక్‌ను రివీల్ చేయకూడదని భావించినా ఇప్పటికే లీక్డ్ వీడియోలు కలవరపాటుకు గురి చేసాయి.