పిక్ టాక్: కోర్టు టీమ్ ఆనందం మామూలుగా లేదుగా!
ఇప్పుడు తాజాగా నాని కోర్టు అనే సినిమా ద్వారా మరో టాలెంటెడ్ డైరెక్టర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. మార్చి 14న రిలీజైన కోర్టు సినిమాకు ఆడియన్స్ నుంచి మాత్రమే కాకుండా విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలొస్తున్నాయి.;
ఓ వైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా నాని వరుస సక్సెస్‌లు అందుకుంటూ ఫుల్ జోష్ లో ఉన్నాడు. నేచురల్ స్టార్ నాని తన సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ లో టాలెంట్ ఉన్న డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తన బ్యానర్ నుంచి ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను లాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
ఇప్పుడు తాజాగా నాని కోర్టు అనే సినిమా ద్వారా మరో టాలెంటెడ్ డైరెక్టర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. మార్చి 14న రిలీజైన కోర్టు సినిమాకు ఆడియన్స్ నుంచి మాత్రమే కాకుండా విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలొస్తున్నాయి. ఈ సినిమాలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, సాయి కుమార్, శివాజీ, రోహిణి ముఖ్య పాత్రల్లో నటించారు.
కోర్టు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ మొత్తం నవ్వుతూ ఫోటో దిగగా, ఆ ఫోటోను నాని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ, తమ సినిమాను ఆదరిస్తున్న ఆడియన్స్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ హ్యాపీ ఫేసెస్ కు రీజన్ గా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ నాని ఫోటోలను పోస్ట్ చేస్తూ రాసుకొచ్చాడు.
ఈ ఫోటోలో నానితో పాటూ కోర్టు టీమ్ మొత్తం ఉంది. రామ్ జగదీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ఇక నాని విషయానికొస్తే ప్రస్తుతం హిట్3తో పాటూ ది ప్యారడైజ్ సినిమాలతో నాని బిజీగా ఉన్నాడు. హిట్3 తర్వాత నాని మెగాస్టార్ చిరంజీవితో కూడా సినిమాను నిర్మించనున్న విషయం తెలిసిందే.