చ‌ర‌ణ్ 'ఆట కూలీ'గా.. RC16లో ఊహించని మాస్ ట్రీట్!

ఇప్పటికే విడుదలైన లుక్స్, ప్లాన్ చేసిన భారీ షెడ్యూల్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.;

Update: 2025-03-15 14:30 GMT

రామ్ చ‌ర‌ణ్ ప్రస్తుతం RC16 షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, రెగ్యుల‌ర్ స్పోర్ట్స్ డ్రామాగా కాకుండా, పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకుంటోంది. రంగస్థలం తర్వాత చరణ్ మళ్లీ ఈ చిత్రంలో పక్కా నేటివిటీ నేపథ్యంలో కనిపించబోతున్నాడన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన లుక్స్, ప్లాన్ చేసిన భారీ షెడ్యూల్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా, అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోంది. ఇందులోని ప్రత్యేకత ఏమిటంటే, సాధారణంగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు ఒక ఆట చుట్టూ నడుస్తుంటాయి. కానీ RC16 మాత్రం ఆ నిబంధనను బ్రేక్ చేసి, క్రికెట్, కుస్తీ, కబడ్డీ వంటి వేరువేరు ఆటలను కథలో మిక్స్ చేస్తుంది.

ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ ‘ఆట కూలీ’గా ఉంటుందన్న విషయం బయటకు రావడంతో, అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. సినిమా మొత్తం మైదానంలో నడుస్తుందని భావించాలా లేదంటే వీటన్నింటినీ కలిపి ఒక ప్రత్యేకమైన కథ రాశారా? అనే ప్రశ్నలపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన కోచ్ పాత్ర ఉంది. ఆ క్యారెక్టర్‌ను శివరాజ్ కుమార్ పోషించబోతున్నట్లు సమాచారం.

ఆయనతో పాటు జగపతిబాబు, మేఘన్ రాజ్ వంటి నటులు కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కథ కేవలం ఆటల కోణంలో కాకుండా, ఎమోషనల్ డ్రామాతో కూడుకున్నది. చరణ్ గతంలో ‘రంగస్థలం’లో సాధారణ మనిషిగా ఎమోషనల్ కానెక్ట్ తీసుకొచ్చిన విధంగా, ఈ సినిమాలో కూడా తన పాత్ర ఇంటెన్సిటీ ఎక్కువగానే ఉండబోతోందట. మ్యూజిక్ విషయానికి వస్తే, ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది చరణ్ సినిమాకి అదనపు బలంగా మారనుంది.

ఇప్పటికే కొన్ని ట్రైనింగ్ సెషన్‌ల్లో చరణ్ చూపించిన డెడికేషన్, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసింది. బుచ్చిబాబు తన మొదటి సినిమా ఉప్పెనతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు చరణ్ రేంజ్ స్టార్‌తో పని చేయడం అతనికి కూడా పెద్ద ఛాలెంజ్ కానుంది. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం, RC16 షూటింగ్‌లో ఎక్కువగా రియల్ లొకేషన్లనే వాడుతున్నారు. మరింత నేచురల్ ఫీల్ కోసం ప్రత్యేకమైన సెట్స్ కాకుండా, నిజమైన మైదానాలు, గ్రామీణ వాతావరణం వంటివి స్క్రీన్‌పై రాబోతున్నాయి.

గతంలో రంగస్థలంతో చరణ్ నేటివిటీ మాస్ లుక్‌లో మెప్పించాడని భావిస్తే, ఈ సినిమాలో అయితే పూర్తి విభిన్నమైన క్యారెక్టర్‌తో అభిమానులకు ఊహించని మాస్ ట్రీట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా 2026 మొదట్లోనే రిలీజ్ అయ్యే అవకాశముంది. ప్రస్తుతానికి హై స్పీడ్‌లో షూటింగ్ నడుస్తుండటంతో, టీజర్, ఫస్ట్ లుక్ అప్డేట్స్ ఎప్పుడొస్తాయో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి బుచ్చిబాబు మెగా తనయుడికి ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.

Tags:    

Similar News