అనన్య నాగళ్ల.. సడన్ గా ఇలా హీటెక్కిస్తే ఎలా?

అయితే అనన్య కెరీర్‌ను పరిశీలిస్తే, ఆమె ప్రయాణం కేవలం నటనతోనే కాకుండా గ్లామర్ వైపు కూడా యూ టర్న్ తీసుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.;

Update: 2025-03-15 17:30 GMT
అనన్య నాగళ్ల.. సడన్ గా ఇలా హీటెక్కిస్తే ఎలా?

తెలుగు ప్రేక్షకులకు మల్లేశం చిత్రంతో పరిచయమైన అనన్య నాగళ్ల, అప్పట్లో తన సహజమైన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. ఓ గ్రామీణ యువతిగా కనిపించిన ఆమె, ఆ సినిమాతోనే నటిగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. అయితే అనన్య కెరీర్‌ను పరిశీలిస్తే, ఆమె ప్రయాణం కేవలం నటనతోనే కాకుండా గ్లామర్ వైపు కూడా యూ టర్న్ తీసుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.


వకీల్ సాబ్ వంటి సినిమాల్లో తన మృదువైన నటన చూపించినప్పటికీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో తన గ్లామరస్ లుక్స్‌తో మరో లెవల్ క్రేజ్ తెచ్చుకుంటోంది. ఇటీవల అనన్య నాగళ్ల ఫొటోషూట్స్ ట్రెండ్ అవుతున్నాయి. మరింత బోల్డ్ అవతారం ఎత్తిన అనన్య, తన స్టైల్‌ను పూర్తిగా మార్చేసింది. ఆమె షేర్ చేసిన సారీ ఫొటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.


పసుపు రంగు చీరలో, క్లోజ్-ఫిట్ బ్లౌజ్‌తో ఒంటిపై కాంతిని మెరిపిస్తూ ఆమె ఇచ్చిన హొయలే వేరు. కిల్లింగ్ లుక్స్‌తో, కళ్లతో మాట్లాడే అందంతో ఆమె ఫొటోలు వైరల్ అయ్యాయి. ఒకప్పుడు క్లాసిక్ పాత్రల్లో మాత్రమే కనిపించిన అనన్య, ఇప్పుడు ఫుల్ గ్లామరస్ అవతార్‌లో దర్శనమిస్తోంది. ఇది చూసిన నెటిజన్లు, ఇమే మల్లేశం భామననే.. అంటూ ఆశ్చర్యపోతున్నారు.


ప్రత్యేకంగా, ఆమె తన సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను పెంచుకునే దిశగా ముందుకు సాగుతుందనే అభిప్రాయం కలుగుతోంది. డిజిటల్ ప్రపంచంలో యాక్టివ్‌గా ఉంటూ, నిత్యం హాట్ ఫోటోషూట్‌లతో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. ఇటీవల ఆమెను వెబ్‌సిరీస్‌లు, మిడియం రేంజ్ సినిమాలు కూడా పలకరిస్తున్నాయట. ఆమె గ్లామర్ గేమ్‌ మరింత పెంచుకుంటూ వెళితే, టాలీవుడ్‌లో టాప్ గ్లామరస్ హీరోయిన్‌గా మారేందుకు సమయం చాలా దూరం లేదని అంటున్నారు.


సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన అనన్య నాగళ్ల, భవిష్యత్తులో మరింత వైవిధ్యమైన పాత్రలతో రాణిస్తుందా లేక ఫుల్ గ్లామర్ రూట్‌లోకి వెళ్లిపోతుందా? అనే చర్చ మాత్రం ఇండస్ట్రీలో నడుస్తోంది. ఏదేమైనా, ఆమె తాజా గ్లామరస్ ఫోటోషూట్‌లు మాత్రం టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి.

Tags:    

Similar News