ఎన్టీఆర్ మ‌రో 1000 కోట్ల క్ల‌బ్ మూవీలో?

ఆర్.ఆర్.ఆర్ తో 1000 కోట్ల క్ల‌బ్ హీరోలు అయ్యారు రామ్ చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్. పాన్ ఇండియ‌న్ స్టార్స్ గా ఖ్యాతి ఘ‌డించిన ఆ ఇద్ద‌రు స్టార్ల కెరీర్ జ‌ర్నీ మునుముందు ఎలా ఉంటుందో చూడాల‌ని అభిమానులు ఉత్సాహం ప్ర‌ద‌ర్శించారు.;

Update: 2025-03-16 11:52 GMT

ఆర్.ఆర్.ఆర్ తో 1000 కోట్ల క్ల‌బ్ హీరోలు అయ్యారు రామ్ చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్. పాన్ ఇండియ‌న్ స్టార్స్ గా ఖ్యాతి ఘ‌డించిన ఆ ఇద్ద‌రు స్టార్ల కెరీర్ జ‌ర్నీ మునుముందు ఎలా ఉంటుందో చూడాల‌ని అభిమానులు ఉత్సాహం ప్ర‌ద‌ర్శించారు. కానీ రామ్ చ‌ర‌ణ్ `గేమ్ ఛేంజ‌ర్` తీవ్రంగా నిరుత్సాహ‌ప‌రిచింది. న‌టుడిగా చ‌ర‌ణ్ షైన్ అయినా కానీ, శంక‌ర్ స‌రైన సినిమాని అందించ‌క‌పోవ‌డం నిరాశ‌ప‌రిచింది.

అయితే ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత కొర‌టాల శివ‌తో `దేవ‌ర` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందించాడు ఎన్టీఆర్. ఒక పెద్ద పాన్ ఇండియా హిట్ త‌ర్వాత‌ త‌న స్నేహితుడికి అవ‌కాశం ఇవ్వ‌డం తెలివైన నిర్ణ‌య‌మ‌ని ఎన్టీఆర్ ప్రూవ్ చేసాడు. దేవ‌ర ప్రపంచవ్యాప్తంగా: 447.6 కోట్ల గ్రాస్, 290.6 కోట్ల నెట్ వ‌సూళ్ల‌ను సాధించింది. హిందీ బెల్ట్ నుంచి

64.2 కోట్ల నికర వ‌సూళ్ల‌ను సాధించ‌గా, ఏపీ - తెలంగాణ నుంచి 235.7 కోట్ల నిక‌ర వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ ఫ‌లితం ఎన్టీఆర్ లో హుషారును పెంచింది. త‌దుప‌రి `వార్ 2` కోసం తీవ్రంగా శ్ర‌మించే శ‌క్తిని ఇచ్చింది.

య‌ష్ రాజ్ బ్యానర్ రూపొందిస్తున్న‌ క్రేజీ మూవీ `వార్ 2` కోసం అత‌డు హృతిక్ రోషన్ తో ఢీకొడుతుండ‌డం అంత‌కంత‌కు ఉత్కంఠ‌ను పెంచేస్తోంది. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ చివరి దశలో ఉంది. వార్ 2 ఈ సంవత్సరం ఆగస్టు 14న విడుదలవుతోంది. హృతిక్ గాయం, ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ తండ్రి మ‌ర‌ణం కార‌ణంగా చిత్రీక‌ర‌ణ కొంత ఆల‌స్య‌మైనా కానీ, స్వాతంత్య్ర దినోత్స‌వానికి ఇది విడుద‌ల‌వ్వ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. వార్ 2 షూటింగ్‌లో ఎక్కువ భాగం పూర్తయింది. పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. య‌ష్ రాజ్ బ్యాన‌ర్ వార్ 2ని 1000 కోట్ల క్ల‌బ్ లో నిల‌పాల‌ని చాలా ఎఫ‌ర్ట్ పెడుతోంది. దీనికోసం భారీ బ‌డ్జెట్ ని కేటాయించింది.

అందుకే ఈ చిత్రం ఎన్టీఆర్ స్టార్ డ‌మ్ ని మ‌రో లెవ‌ల్ కి చేరుస్తుంద‌ని భావిస్తున్నారు. తార‌క్ కెరీర్ కి మ‌రో వెయ్యి కోట్ల క్ల‌బ్ యాడ‌వుతుంద‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు. మ‌రోవైపు రామ్ చ‌ర‌ణ్ త‌న త‌దుపరి చిత్రాన్ని బుచ్చిబాబు ద‌ర్శక‌త్వంలో చేస్తున్నాడు. ఆర్.సి 16 చిత్రీక‌ర‌ణ సాగుతోంది. ఇది అత‌డికి పాన్ ఇండియాలో మంచి బ్లాక్ బ‌స్ట‌ర్ ని ఇస్తుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. ప్ర‌స్తుతానికి ఎన్టీఆర్ కొంత పైచేయి సాధించాడు. మునుముందు త‌న స్నేహితుడు చ‌ర‌ణ్ కూడా స‌రిజోడులా దూసుకొస్తాడ‌ని వేచి చూస్తున్నాడు. కొన్నిటికి కాల‌మే స‌మాధానం చెప్పాలి.

Tags:    

Similar News