ఈ ఏడాదిలోనే... సీక్వెల్‌పై హీరో అఫిషియల్ ప్రకటన!
లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్‌తో 'కూలీ' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాను ఈ ఏడాది దసరా లేదా దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.;
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'ఖైదీ 2'. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా వచ్చి ఆరు ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఎక్కడో ఒక చోట చర్చ జరగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఖైదీ సినిమాలోని ఢిల్లీ పాత్ర గురించి, దర్శకుడు లోకేష్ కనగరాజ్ మేకింగ్ గురించి, టేకింగ్ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతూనే ఉంది. లోకేష్ కనగరాజ్ యూనివర్శ్ సినిమాలు అయిన విక్రమ్, లియో సినిమాల్లోనూ ఖైదీ సినిమా ప్రస్తావన ఉన్న విషయం తెల్సిందే. అందుకే ఖైదీ సీక్వెల్ గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్‌తో 'కూలీ' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాను ఈ ఏడాది దసరా లేదా దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. కూలీ సినిమా కంటే ముందు కార్తీతో ఖైదీ 2 సినిమాను మొదలు పెట్టాల్సి ఉంది. కానీ రజనీకాంత్ నుంచి వచ్చిన ఆఫర్‌ను హోల్డ్‌లో పెట్టడం ఇష్టం లేక దర్శకుడు లోకేష్ కనగరాజ్ 'కూలీ' సినిమాను చేసేందుకు సిద్ధం అయ్యాడని కోలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కూలీ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నట్లు సమాచారం అందుతోంది. అతి త్వరలోనే ఖైదీ 2 సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా హీరో కార్తీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ను కలిసిన కార్తీ చేతికి కడియంను బహూకరించాడు. ఆ తర్వాత కలిసి ఫోటోలకు ఫోజ్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలతో పాటు ఢిల్లీ రిటర్న్స్... మరో అద్భుతమైన ఏడాది రెడీగా ఉంది అంటూ కార్తీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దాంతో ఖైదీ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈ ఏడాదిలో షూటింగ్ ప్రారంభం కాబోతుంది అనే నమ్మకం కలిగింది. ఈ ఏడాది కార్తీకి చాలా స్పెషల్ ఇయర్‌గానూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు.
ఖైదీ 2 సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయింది. విభిన్నమైన చిత్రాలతో పాటు, తనదైన స్టైల్ యాక్షన్ సన్నివేశాలను లోకేష్ కనగరాజ్ సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. అందుకే ఖైదీ 2 సినిమాలోనూ అదే మార్క్ సీన్స్ ఉంటాయనే విశ్వాసంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఖైదీ 2 ఉంటుందని సమాచారం అందుతోంది. ఖైదీ 2 లో కార్తీతో పాటు ఒక కోలీవుడ్ స్టార్ హీరో కనిపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఖైదీ లో రోలెక్స్ ను భాగం చేస్తే బాగుంటుంది అని కొందరు అభిమానులు అంటున్నారు. మరి లోకేష్ కనగరాజ్ ప్లాన్ ఏంటి అనేది చూడాలి.