2026 లోనే SSMB 29!
ఈ నేపథ్యంలో మహేష్ తో చేస్తోన్న అడ్వెంచర్ థ్రిల్లర్ కూడా అదే విధానంలో రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు.;
# ఎస్ ఎస్ ఎంబీ 29 ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అంటే రిలీజ్ అవ్వడానికి ఎలా లేదన్నా రెండేళ్లకు పైగానే సమయం పడుతుంది? అన్నది అందరి నుంచి వినిపిస్తున్నదే. ఎందుకంటే రాజమౌళి `బాహుబలి` నుంచి ఏ ప్రాజెక్ట్ టేకప్ చేసినా అది భారీ స్పాన్ ఉన్న సినిమా కావడంతో రిలీజ్ గురించి రెండేళ్ల తర్వాత తప్ప ముందు ఆలోచించాల్సిన పనిలేదని ప్రేక్షకులు ఫిక్సైపోయారు.
ఈ నేపథ్యంలో మహేష్ తో చేస్తోన్న అడ్వెంచర్ థ్రిల్లర్ కూడా అదే విధానంలో రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు. ఇంకా రెండేళ్లకు మించే సమయం పడుతుందని అంతా భావిస్తున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి? అంటే ఈ సినిమాని ఏడాదిన్నర లోపే రిలీజ్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. ఈ విషయంలో జక్కన్న చాలా క్లారిటీతో ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది.
'బాహుబలి' మొదలైనప్పుడు అదే రాజమౌళి తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో? పనులేవి అనుకున్న విధంగా జరగకపోవడం...మధ్యలో అదే సినిమాని రెండు భాగాలుగా చేయడంతో? రిలీజ్ విషయంలో ఆలస్యం జరిగిందన్నది వాస్తవం. అటుపై 'ఆర్ ఆర్ ఆర్' చిత్రం విషయంలోనూ అలాగే జరిగింది. ఈ రెండు సినిమా అనుభవం నుంచి రాజమౌళి నేర్చుకుంది అంటే? మూడవ చిత్రాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏడాదిన్నర లోపు రిలీజ్ చేసే పకడ్పందీ ప్రణాళిక అని...అది ఈ సినిమాకు పక్కాగా కుదిరిందంటున్నారు.
'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ అనంతరమే రాజమౌళి మహేష్ సినిమా పనులు మొదలు పెట్టారని..ఇప్పటి వరకూ అంతా తాను అనుకున్న విధంగా పక్కా ప్రణాళికతోనే పూర్తయిందంటున్నారు. స్టోరీ డిస్కషన్ దగ్గర నుంచి వర్క్ షాప్స్ నిర్వహణ..అటుపై షూటింగ్ కి వెళ్లడం ఎక్కడా ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా పూర్తయిందంటున్నారు. ఇదే ప్రణాళికతో షూటింగ్ మొత్తం ఏడాదిలోపు పూర్తి చేయడం..అటుపై మరో నాలుగైదు నెలలు సీజీ వర్క్ పూర్తి చేయగల్గితే 2026 లో మిడ్ లోనే సినిమా రిలీజ్ అవుతుందని ఆయన సన్నిహిత వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.