ప్రేమలో విఫలమై మందుకు బానిసైన స్టార్ హీరో సిస్టర్
అతడు ఎన్టీఆర్ తో కలిసి ఓ భారీ పాన్ ఇండియన్ చిత్రంలోను నటిస్తున్నాడు.;
ప్రపంచవ్యాప్తంగా అసాధారణ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో అతడు. అతడిని గ్రీక్ గాడ్ అని ఆరాధిస్తారు గాళ్స్. అతడి క్రీగంటి చూపు కోసం వారంతా పరితపించిపోతారు. ప్రస్తుతం అతడు భార్య నుంచి విడాకులు తీసుకుని, గాళ్ ఫ్రెండ్‌తో డేటింగ్ లో ఉన్నాడు. అతడు ఎన్టీఆర్ తో కలిసి ఓ భారీ పాన్ ఇండియన్ చిత్రంలోను నటిస్తున్నాడు.
అయితే ఈ హీరో ఎవరో తెలుసుకునే ముందు.. అతడి సోదరి చెడు అలవాటు గురించి తెలుసుకుంటే నిజంగా షికిస్తుంది. ఆమె మత్తుకు బానిసైంది. రోజంతా తాగూతూ తూలుతూ గడిపేస్తుంది. బెడ్ పై నుంచి కుర్చీల మీది నుంచి కూడా కింద పడిపోతోంది. తాగిన మైకంలో ఏం చేస్తోందో కూడా తెలుసుకోలేని స్థితి. తన ఆల్కహాల్ అలవాటును మాన్పించేందుకు తల్లిదండ్రులు ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఏం లాభం లేదు. చివరికి మత్తును మాన్పించే పునరావాస కేంద్రంలో తనను చేర్చారు. అక్కడ నెమ్మదిగా ఆల్కహాల్ ను మానేయడం నేర్చుకుంది. చివరికి మద్యం మానేసింది. కానీ ఇంతలోనే ఒక షాకింగ్ విషయం బయటపడింది. ఆమెకు గర్భాశయ క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయింది. అయితే ఈ ప్రమాదకర క్యాన్సర్ ను చికిత్సతో జయించింది.
ఇలాంటి భయానక నేపథ్యం ఉన్న ఆమె ఎవరు? అంటే ... బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ సోదరి సునైనా గురించే ఇదంతా. సునైన ఇటీవల మద్యం వ్యసనంతో తన పోరాటాలను బహిరంగంగా వెల్లడించింది. తన జీవితంలో ఒకానొక సమయంలో, మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు తాగుడు అలటైందని తెలిపింది. ఆ సమయంలో మద్యం తనకు తట్టుకోవడానికి సహాయపడిందని సునైనా అంది. దీనివల్ల తాగడం తప్పు కాదని అనుకుందట. అయితే మద్యంపై నియంత్రణ కోల్పోయిన తర్వాత ప్రమాదకరంగా మారుతుందని సునైన హెచ్చరించింది.
తాను ప్రమాదంలో పడ్డానని అంది. ఉదయం నుండి రాత్రి వరకు విరామం లేకుండా తాగడం తన పని అని చెప్పింది. తాగుడుపై నియంత్రణ కోల్పోయింది. తన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. చివరికి మద్యం లేకుండా పనిచేయలేకపోయింది. ఆమె తల్లిదండ్రులు రాకేష్ రోషన్ - పింకీ రోషన్ కూడా ఆమెను నియంత్రించడంలో విఫలమయ్యారు. క్రెడిట్ కార్డులను లాక్కున్నారు. మందు ఫ్రెండ్స్ ని కట్ చేసారు. కానీ ఏదీ పని చేయలేదు. చివరకు సునైన తనకు తానుగానే మారింది. పునరావాస కేంద్రంలో చేరి ఆల్కహాల్ మానేసింది. తర్వాత వ్యసనం నుంచి కోలుకున్నా గర్భాశయ క్యాన్సర్ ఉందని తెలిసి షాకైంది. దానిని కూడా చికిత్సతో జయించింది.
అసలు కథ వేరే ఉంది:
అయితే హృతిక్ రోషన్ సోదరి సునైన డేటింగ్ గురించి గతంలో మీడియాలో కథనాలొచ్చాయి. తనకు పరిచయమైన ఒక ముస్లిమ్ యువకుడిని ప్రేమించి అతడినే పెళ్లాడతానని ఇంట్లో పట్టుబట్టినట్టు కథనాలొచ్చాయి. కానీ దీనిని తన తల్లిదండ్రులు సోదరుడు వ్యతిరేకించడంతో సునైన వారితో బాహాబాహీకి దిగిన ఘటనపై మీడియాలో కథనాలొచ్చాయి. ఒక ముస్లిమ్ యువకుడితో ప్రేమలో ఉన్న తనను తల్లిదండ్రులు కొట్టారని తిట్టారని కూడా పోలీసులకు ఫిర్యాదునివ్వడం కలకలం రేపింది. సునైనకు అంతకుముందు రెండు పెళ్లిళ్లు బ్రేకప్ అయ్యాయి. ఒక కుమార్తె కూడా తనకు ఉంది.