రెహ‌మాన్ సేఫ్‌

స్వ‌ర‌మాంత్రికుడు ఏ.ఆర్.రెహ‌మాన్ ఆస్ప‌త్రి పాల‌య్యారంటూ ఈ రోజు ఉద‌య‌మే వార్త‌లు రావ‌డం అభిమానుల‌ను కంగారు పెట్టింది.;

Update: 2025-03-16 07:17 GMT

స్వ‌ర‌మాంత్రికుడు ఏ.ఆర్.రెహ‌మాన్ ఆస్ప‌త్రి పాల‌య్యారంటూ ఈ రోజు ఉద‌య‌మే వార్త‌లు రావ‌డం అభిమానుల‌ను కంగారు పెట్టింది. ఆయ‌న‌కు చాతీ నొప్పి ఉందంటూ కొన్ని మీడియాల్లో క‌థ‌నాలు వైర‌ల్ చేయ‌డంతో మ‌రింత‌గా ఫ్యాన్స్ క‌న్ఫ్యూజ్ అయ్యారు.

విదేశాల నుంచి వ‌చ్చిన రహ‌మాన్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఛాతీ నొప్పితో బాధపడుతుండటంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. వెంటనే వైద్య సహాయం కోసం అత్యవసర వార్డుకు తరలించారంటూ ప్ర‌చార‌మైంది. కానీ రెహ‌మాన్ అనారోగ్యంపై ఇప్పుడు ఆస్ప‌త్రి వ‌ర్గాలు చెప్పిన మాట వేరుగా ఉంది. అపోలో హాస్పిటల్స్ సీఈవో డాక్టర్ మధు శశిధర్ మాట్లాడుతూ- రెహమాన్ ఇప్పుడు పూర్తిగా క్షేమంగా ఉన్నారని, ఆయన డిశ్చార్జ్ అయినందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

రెండు పరీక్షల తర్వాత రెహమాన్ త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని మేం ఇప్పటికే చెప్పాము. ఇప్పుడు ఆయ‌న ఇంటికి వెళ్లారు. ఎలాంటి స‌మ‌స్యా లేదు! అని శ‌శిధ‌ర్ చెప్పారు. నిజానికి రంజాన్ మాసం కార‌ణంగా ఉప‌వాస ధీక్ష‌లో ఉన్న రెహ‌మాన్ స‌హ‌జంగానే వీక్ గా ఉన్నారు. దాంతో అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీనికి తోడు డీహైడ్రేష‌న్ అవ్వ‌డంతో ఆస్ప‌త్రిలో చేరాల్సి వ‌చ్చింద‌ని ఎన్డీటీవీ త‌న క‌థ‌నంలో పేర్కొంది.

రెహమాన్ చాలా గ్యాప్ త‌ర్వాత‌ రామ్ చరణ్ RC16 తో తిరిగి టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. ఈ సినిమా పాట‌లు వినేందుకు అభిమానులు ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నారు. బుచ్చిబాబు స‌నా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, రామ్ చ‌రణ్ త‌న వంద‌శాతం బెస్ట్ ఇచ్చేందుకు హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మ‌ణిర‌త్నం - థ‌గ్ లైఫ్ కు రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు.

Tags:    

Similar News

2026 లోనే SSMB 29!