కల్కి 2లో అశ్వథ్థామ అంతకు మించి..!

నాగ్‌ అశ్విన్‌ రెండో పార్ట్‌ విషయంలో మరింత శ్రద్ద కనబర్చుతున్నారు అంటూ ఆయన సన్నిహితులు సోషల్‌ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు.;

Update: 2025-03-16 07:33 GMT

గత సంవత్సర ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కల్కి : 2898 ఏడీ' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రభాస్ ఖాతాలో మరో వెయ్యి కోట్ల సినిమాగా కల్కి నిలిచిన విషయం తెల్సిందే. కల్కి సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో సీక్వెల్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. కల్కి 2 సినిమా షూటింగ్‌ను జూన్‌ నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే పార్ట్‌ 2 కి సంబంధించి 30 శాతం షూటింగ్‌ పూర్తి చేసినట్లుగా నిర్మాతలు స్వప్న, ప్రియాంక దత్‌లు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నాగ్‌ అశ్విన్‌ రెండో పార్ట్‌ విషయంలో మరింత శ్రద్ద కనబర్చుతున్నారు అంటూ ఆయన సన్నిహితులు సోషల్‌ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు.

ఇటీవలే అమితాబ్‌ బచ్చన్ తన కౌన్‌బనేగా కరోడ్‌పతి సందర్భంగా కల్కి 2 షూటింగ్‌లో జూన్‌ నుంచి పాల్గొంటానని పేర్కొన్నారు. ఆ విషయం పక్కన పెడితే ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కల్కి 2 లో అమితాబ్‌ పాత్ర అశ్వథ్థామ మరింత ప్రాధాన్యతను కలిగి ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా కమల్‌ హాసన్‌తో అశ్వథ్థామ యాక్షన్‌ సీన్ ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా ప్రభాస్‌, అమితాబ్‌లు కలిసి చేసే యాక్షన్‌ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. దీపికా పదుకునేకి మద్దతుగా వీరిద్దరు చేసే పోరాటలతో సెకండ్‌ హాఫ్ సాగుతుందని కథ గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

కల్కిలో అమితాబ్ పోషించిన పాత్ర అశ్వథ్థామ లుక్‌ చూసి అంతా షాక్ అయ్యారు. నార్మల్‌ లుక్‌లోనే చూపిస్తూ అందరి కంటే హైట్‌గా అమితాబ్‌ను చూపించడం ద్వారా ఆయన పాత్ర చాలా ప్రత్యేకంగా నిలిచింది. కల్కి 2 లో ఆయన పాత్ర మరింత ఎక్కువగా ఉంటుందని, ఆయన సన్నివేశాలు అంతకు మించి ఉంటాయని సమాచారం అందుతోంది. అతి త్వరలోనే సినిమా స్క్రిప్ట్‌ను లాక్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు. సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కోసం ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కల్కి 2 సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేసే విధంగా ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుందని సమాచారం అందుతోంది.

కలియుగం అంతంను, మహాభారతంను విభిన్నంగా కలిపి చూపించిన దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ విజనరీకి అంతా ఫిదా అయ్యారు. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు సైతం ఈ సినిమా గురించి ప్రముఖంగా చర్చించుకునేలా, భవిష్యత్తు గురించి మాట్లాడుకునేలా చేసింది. కల్కి మొదటి భాగంలో కమల్‌ పాత్ర పరిమితంగా ఉంటుంది. కానీ కల్కి 2 సినిమాలో ఆయన పాత్ర సైతం ప్రముఖంగా ఉంటుందని తెలుస్తోంది. అశ్వథ్థామ పాత్రను కల్కి 2 లో ప్రభాస్ పాత్రను డామినేట్‌ చేసే విధంగా చూపిస్తారనే టాక్‌ వినిపిస్తుంది.

Tags:    

Similar News

2026 లోనే SSMB 29!