'కన్నప్ప'పై హైప్ పెంచుతున్న మంచు విష్ణు.. ప్రమోషన్స్ లో స్ట్రాంగ్ మూవ్

ఇటీవలే ఊటుకూరు గ్రామంలోని భక్త కన్నప్ప ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించడం దానికి నిదర్శనం. అంతే కాకుండా ఆలయ అభివృద్ధి కోసం తనవంతు సహాయం చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు మాట ఇచ్చారు.;

Update: 2025-03-15 12:38 GMT

మంచు విష్ణు ఈసారి ఏ చిన్న అవకాశం కూడా వదులుకోవడం లేదు. కన్నప్ప సినిమా విడుదల సమయం దగ్గరపడుతుండగా, ప్రమోషన్స్ విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తూ, మరింత స్ట్రాంగ్ స్ట్రాటజీ తీసుకున్నాడు. ఇటీవలే ఊటుకూరు గ్రామంలోని భక్త కన్నప్ప ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించడం దానికి నిదర్శనం. అంతే కాకుండా ఆలయ అభివృద్ధి కోసం తనవంతు సహాయం చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు మాట ఇచ్చారు.


ఈ యాత్ర ద్వారా సినిమా అండగా ఉన్న పాజిటివ్ బజ్‌ను మరింత బలోపేతం చేయడమే కాదు, దైవత్వాన్ని హైలెట్ చేస్తూ జనాలను ఒక మంచి ట్రాక్ లో ఆకర్షిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో విష్ణు మొదటి నుంచీ ప్రమోషన్ స్ట్రాటజీని సీరియస్‌గా ప్లాన్ చేశాడు. ఆలయాన్ని సందర్శించడం ద్వారా సినిమా ఆధ్యాత్మిక నేపథ్యాన్ని నొక్కి చెప్పేలా చూసాడు. ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకుల దృష్టిని సినిమా మీద మరింతగా కేంద్రీకరించడానికి ఇది సరైన స్టెప్ అని అనిపిస్తోంది. ఆలయ పరిసరాల్లో అభిమానులు, గ్రామస్తులు విష్ణును ఘనంగా ఆహ్వానించడం కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది.


సినిమాపై ఇప్పటికే చాలా పాజిటివ్ బజ్ ఉంది. విడుదలైన సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. శివుడి పాట శివభక్తులకు అద్భుత అనుభూతిని అందిస్తున్నాయి. మ్యూజిక్ విషయంలో ఎలాంటి రాజీపడకుండా, గ్రాండ్ ఆల్బమ్ అందించడంలో విష్ణు టీమ్ సక్సెస్ అయింది. సినిమా మేకింగ్ వీడియోలు, అప్‌డేట్స్ అన్నీ దశల వారీగా రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నారు.

ముఖ్యంగా స్టార్ క్యాస్ట్ సినిమాకు మాస్ లెవెల్లో హైప్ తీసుకువచ్చింది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ వంటి స్టార్ హీరోలు భాగమవ్వడంతో సినిమా హంగామా పెరిగిపోయింది. వీరి స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రమే కాదు, క్యారెక్టర్స్‌కు కూడా మంచి స్కోప్ ఉందని విష్ణు ఇటీవల వెల్లడించాడు. ఈ లెవెల్లో స్టార్ క్యాస్ట్ ఉండటంతో ప్రేక్షకులు అంచనాలను మరింత పెంచుకుంటున్నారు.

పాన్ ఇండియా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా విజువల్ గ్రాండియర్, ఎమోషనల్ ఎలిమెంట్స్, పవర్‌ఫుల్ కథనంతో భక్త కన్నప్ప రానుంది. తెలుగులో అయితే ఈ సినిమా పైసా వసూల్ విజువల్ ఎంటర్టైనర్‌గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక బాలీవుడ్, మలయాళం, కన్నడ, తమిళ పరిశ్రమల్లో కూడా ఇదే స్థాయిలో ఆదరణ పొందేలా టీమ్ ప్రచారాన్ని అమలు చేస్తోంది.

అంతా చూస్తుంటే, మంచు విష్ణు ఈ సినిమాతో తన కెరీర్‌లోనే ఓ మెమోరబుల్ హిట్ అందుకోవడం ఖాయమని ఫిలిం సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. ఆలయ సందర్శనతో మొదలైన ప్రచారం, విడుదల తేదీ దగ్గరపడే కొద్దీ మరింత ఆగ్రెసివ్ గా మారబోతోందని తెలుస్తోంది. భక్త కన్నప్ప ఏప్రిల్ 25న విడుదల కానుంది, ఆ రోజు వరకు విష్ణు ప్రమోషన్స్ ను ఇంకో లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయం!

Tags:    

Similar News