పార్టీలో ప్రేమ‌ప‌క్షులు త‌లో దారి ఏంటో ఇది

అంద‌మైన‌ జంట తమన్నా భాటియా - విజయ్ వర్మ విడిపోయారని పుకార్లు షికార్ చేస్తున్నాయి.;

Update: 2025-03-15 22:30 GMT

అంద‌మైన‌ జంట తమన్నా భాటియా - విజయ్ వర్మ విడిపోయారని పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఆ ఇద్ద‌రూ కొంత‌కాలంగా ఒక‌రికొక‌రు దూరంగా ఉన్నారు. జంట‌గా క‌లిసి ఉన్న ఫోటోల‌ను ఇన్ స్టా నుంచి తొల‌గించారు. ఈ వార్త‌లు వెలువడిన కొన్ని రోజుల తర్వాత ఈ శుక్రవారం బాలీవుడ్ వెట‌ర‌న్ న‌టి రవీనా టాండన్ హోలీ పార్టీకి ఇద్దరు తారలు హాజరయ్యారు. వేడుక నుండి వారి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ పార్టీలో ఆ ఇద్దరూ ఎక్క‌డా క‌లిసి లేరు. పైగా విడివిడిగా క‌నిపించారు.


తమన్నా తెల్లటి ట్యూబ్ టాప్, ఆలివ్ గ్రీన్ కార్గో ప్యాంటు - జాకెట్ ధ‌రించి సాదా చొక్కాలో క‌నిపించింది. విజ‌య్ తెల్లటి టీ-షర్ట్, జీన్స్ - స్టైలిష్ సన్ గ్లాసెస్ ధరించి వచ్చాడు. తమన్నా వచ్చే సమయంలో ఫోటోగ్రాఫర్లు ర‌వీనా టాండన్ ఇంటి వెలుపల ఉన్నారు. సీనియ‌ర్ న‌టి అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపింది. మరోవైపు విజయ్ హోలీ పండుగ మూడ్ లో రంగులతో త‌డిసి ముద్ద‌యి క‌నిపించాడు. అత‌డు ఈ వేడుక ఆద్యంతం చాలా ఉత్సాహంగా కనిపించాడు. స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ల‌ను హార్ట్ ఫుల్‌గా పలకరించాడు. లోపలికి వెళ్ళే ముందు కొంద‌రు ఫోటోగ్రాఫర్లపై సరదాగా రంగులు అద్ది వేడుకల స‌ర‌దా మూడ్‌ను క్యారీ చేసాడు.


తమన్నా భాటియా - విజయ్ వర్మ తమ సంబంధం గురించి ఎప్పుడూ ఓపెన్ గానే ఉన్నారు. 2023లో లస్ట్ స్టోరీస్ 2 విడుదలైన సమయంలో ఈ జంట‌ తమ ప్రేమను ధృవీకరించారు. మొద‌టిసారి క‌లిసి ప‌ని చేసారు. ఆ త‌ర్వాత ప్రేమ‌లో ప‌డ్డారు. కానీ ఈ జంట విడిపోవ‌డానికి కార‌ణం కెరీర్ ప్ర‌యాణాలే. కేవ‌లం కెరీర్ కోస‌మే విజ‌య్ త‌మ‌న్నాను వ‌దులుకుంటున్నాడ‌ని కూడా గుస‌గుస‌లు వినిపించాయి. అత‌డు త‌న ప్రియురాలిని పెళ్లాడే మూడ్ లో లేడు. కానీ త‌మ‌న్నా వెంట‌నే పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల‌వ్వాల‌ని చూస్తోంది.

Tags:    

Similar News