ఆ సీక్వెల్ తనయుడుకి బెస్ట్ కంబ్యాక్ అవుతుందా!
సినిమాలో ప్రతీ నటుడి పెర్పార్మెస్ సెల్యూట్ చేసేలా ఉంటుంది.
అప్పట్లో బాలీవుడ్ లో రిలీజ్ అయిన 'బోర్డర్' ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఎపిక్ వార్ డ్రామా అప్పట్లో ఓ సంచలనం. సన్ని డియోల్, సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్, అక్షయ్ ఖన్నా తదిరులు నటించిన చిత్రం గొప్ప దేశభక్తిని రగిలించిన చిత్రంగా బాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయింది. సినిమాలో ప్రతీ నటుడి పెర్పార్మెస్ సెల్యూట్ చేసేలా ఉంటుంది. తాజాగా ఇప్పుడా సినిమాకి సీక్వెల్ గా 'బోర్డర్ -2'ని అనురాగ్ సింగ్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇందులో సన్నీ డియోల్, వరుణ్ ధావన్ , దిల్జిత్ దోసాంజ్ తో పాటు సునీల్ శెట్టి తనయుడు ఆహాన్ శెట్టి కూడా నటి స్తున్నాడు. తండ్రి పాత్రలోకి ఇప్పుడు తనయుడు రంగంలోకి దిగాడు. దీంతో ఆహాన్ కి మంచి కంబ్యాక్ చిత్రంగా నిలుస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. తన నటనతో సునీల్ శెట్టిని తలపిస్తాడని అభిమానులు భావిస్తున్నారు. ఆహాన్ `తడప్` చిత్రంతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు.
కానీ ఆ సినిమా ఆహాన్ కి బెస్ట్ లాంచింగ్ లా నిలవలేదు. దీంతో నాలుగేళ్ల పాటు అవకాశాలు లేక ఖాళీగా ఉన్నాడు. కానీ నటుడిగా మాత్రం తొలి సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. మళ్లీ నాలుగేళ్ల తర్వాత 'శంకీ' చిత్రాన్ని మొదలు పెట్టారు. సరిగ్గా ఇదే సమయంలో 'బోర్డర్ -2' లో కూడా నటించే అవకాశం వచ్చింది. 'బోర్డర్ 2' లో మరో నలుగురు హీరోలున్నా? ఆహాన్ శెట్టి పేరు నెట్టింట వైరల్ గా మారింది. తండ్రిని మించి తనయుడు సక్సెస్ అవ్వాలని నెటి జనులు ఆశిస్తున్నారు.
సునీల్ శెట్టి అప్పట్లో ఓ వెలుగు వెలిగారు. ఎన్నో క్లాసిక్ , యాక్షన్ చిత్రాలతో అలరించారు. కానీ అతడికి రావాల్సి నంత గుర్తింపు రాలేదు. షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తరహాలో సంచలనం కాలే కపోయారు. ఇప్పుడా కోరిక తనయుడు ఆహాన్ శెట్టి రూపంలో నెర వేరుతుందేమో చూడాలి.