లూసిఫర్2: కీలకపాత్రలో అమీర్ ఖాన్ సోదరి
ఇక ఎల్2: ఎంపురాన్ విషయానికి వస్తే, ఈ సినిమాలో నిఖితా ఖాన్ హెగ్డే సుభద్ర బెన్ పాత్రలో నటిస్తోంది.
కంప్లీట్ యాక్టర్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా నటించిన లూసీఫర్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా 2019లో రిలీజై బాక్సాఫీస్ వద్ద బాగానే పే చేసింది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన లూసిఫర్ కు ప్రీక్వెల్ గా ఇప్పుడు పార్ట్2 ను నిర్మించారు.
ఎల్2: ఎంపురాన్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సోదరి నిఖితా ఖాన్ హెగ్డే ఓ కీలక పాత్రలో నటిస్తుంది. నిఖితా ఖాన్ ఇప్పటివరకు సౌత్ సినిమాల్లో నటించింది లేదు.
నిఖితా ఖాన్ ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. కానీ ఆమె సౌత్ లో చేస్తున్న మొదటి సినిమా మాత్రం ఇదే. మిషన్ మంగళ్ సినిమాతో 2019లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిఖితా ఖాన్ ఎక్కువగా కమర్షియల్ ప్రకటనల్లోనే కనిపించింది. రిలయన్స్ జువెల్స్, హల్దీరామ్స్, యాక్సిస్ బ్యాంక్, ఫస్ట్ క్రై, విప్రో యాడ్స్ ఆమెకు ఎంతగానో గుర్తింపును తెచ్చి పెట్టాయి.
అమీర్ ఖాన్ నటించిన లగాన్ సినిమాను స్వయంగా నిఖితా ఖాన్ హెగ్డేనే నిర్మించింది. ఇక ఎల్2: ఎంపురాన్ విషయానికి వస్తే, ఈ సినిమాలో నిఖితా ఖాన్ హెగ్డే సుభద్ర బెన్ పాత్రలో నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సుభాస్కరన్, ఆంటోనీ నిర్మిస్తున్నారు. టొవినో థామస్, మంజు వారియర్, నందు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే రిలీజై సినిమాపై ఉన్న అంచనాల్ని పెంచేసింది.