రామ్ పోతినేనిపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి ప్రశ్న‌

ఒక గంట పాటు వారు క‌లిసి స‌మ‌యం గ‌డిపారు. స్థానిక ఎమ్మెల్యే కందుల దుర్గేష్ రామ్ ని క‌లిసిన స‌మ‌యంలో అనేక ఇతర తేలికపాటి విషయాలు చర్చకు వచ్చాయని తెలుస్తోంది.

Update: 2025-02-22 13:47 GMT

రామ్ పోతినేని అలియాస్ RAPO ఎన‌ర్జిటిక్ డ్యాన్సుల‌కు అభిమానులు కాని వారు లేరు. ఉస్తాద్ ఇస్మార్ట్ శంక‌ర్ మాస్ లో దుమ్ము దులిపేస్తాడు. అత‌డికి యువ‌త‌రంలో అసాధార‌ణ ఫాలోయింగ్ ఉంది. కేవ‌లం యూత్‌ మాత్ర‌మే కాదు రామ్ కి హైప్రొఫైల్స్ లోను ఫాలోయింగ్ ఉంద‌న‌డానికి ఇది ఒక ఉదాహ‌ర‌ణ‌. ఈరోజు రామ్ పోతినేని న‌టిస్తున్న సినిమా సెట్లో ప్ర‌త్య‌క్ష‌మైన ఏపీ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కందుల దుర్గేష్ రామ్ పై ప్ర‌శంస‌లు కురిపించారు.

 

అంతేకాదు రామ్ ఎన‌ర్జిటిక్ డ్యాన్సుల‌కు తాను అభిమానిని అని అన్నారు. రామ్ శ‌రీరంలో స్ప్రింగులేమైనా ఉన్నాయా? అని కూడా స‌ర‌దాగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సెట్స్ లో మర్యాదపూర్వకంగా చిత్ర‌యూనిట్ ని క‌లిసారు. మంత్రివ‌ర్యులు సెట్స్ లో అడ‌గుపెట్ట‌గానే, రామ్ ఇతర స‌భ్యులు హృదయపూర్వకంగా స్వాగతించారు. రామ్‌తో మంత్రిగారు కాసేపు సంభాషణలో మునిగిపోయి అతడి శక్తిని ప్రశంసించారని తెలుస్తోంది.

 

రామ్ నృత్యాలను చూడటం తనకు ఎంత ఇష్టమో మంత్రి మాట్లాడారు. ఆ విధంగా డ్యాన్స్ చేయడానికి వీలు కల్పించే ఏదైనా స్ప్రింగ్‌లు తన శరీరంలో ఉన్నాయా? అని కూడా అడిగార‌ట‌.సెట్స్‌లో సరదా ముచ్చ‌ట్లు కొన‌సాగాయి.

 

ఒక గంట పాటు వారు క‌లిసి స‌మ‌యం గ‌డిపారు. స్థానిక ఎమ్మెల్యే కందుల దుర్గేష్ రామ్ ని క‌లిసిన స‌మ‌యంలో అనేక ఇతర తేలికపాటి విషయాలు చర్చకు వచ్చాయని తెలుస్తోంది.

 

రామ్ త‌న కెరీర్ లో బిగ్ హిట్ కోసం వేచి చూస్తున్నాడు. అత‌డి బాడీ లాంగ్వేజ్ కు త‌గ్గ క‌థ‌ను ద‌ర్శ‌కుడు ఎంపిక చేసుకున్నాడు. ఈ చిత్రానికి మహేష్ బాబు.పి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

Tags:    

Similar News