విశ్వంభరలో ఆ పాట అదిరిందట!
అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో రామ రామ అంటూ సాగే పాట అదిరిపోయిందని, రీసెంట్ గానే ఆ పాటకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తైందని తెలుస్తోంది.
భోళా శంకర్ తో డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి కాస్త గ్యాప్ తీసుకుని తన తర్వాతి సినిమాను బింబిసార ఫేమ్ వశిష్టతో మొదలుపెట్టాడు. విశ్వంభర టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజువల్ ట్రీట్ గా రూపొందుతున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. మామూలుగా అయితే విశ్వంభర మొన్న సంక్రాంతికే రిలీజవాల్సింది కానీ షూటింగ్ లేటవడం వల్ల రిలీజ్ వాయిదా పడింది. తర్వాత మళ్లీ ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందనేది ఇప్పటివరకు మేకర్స్ అనౌన్స్ చేసింది లేదు.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఓ వైపు షూటింగ్ పూర్తి చేసుకుంటూనే మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలతో పాటూ ఆడియో వర్క్స్ ను కూడా పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమాకు కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయిందని, థియేటర్లలో ఈ సాంగ్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తాయని డైరెక్టర్ వశిష్ఠ వెల్లడించిన విషయం తెలిసిందే.
అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో రామ రామ అంటూ సాగే పాట అదిరిపోయిందని, రీసెంట్ గానే ఆ పాటకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తైందని తెలుస్తోంది. ఈ పాటలో చిరంజీవి మేనల్లుడు సాయి దుర్గ తేజ్ అప్పియరెన్స్ కూడా ఉండనుందని సమాచారం. విశ్వంభర ఫస్ట్ లిరికల్ గా ఈ సాంగ్‌నే రిలీజ్ చేసే అవకాశముందని చిత్ర యూనిట్ వర్గాల నుంచి లీకులందుతున్నాయి.
కీరవాణి, చిరంజీవి కాంబినేషన్ లో రానున్న ఈ సాంగ్ అందరినీ మెస్మరైజ్ చేస్తుందని సమాచారం. ఈ వార్త తెలిసిన దగ్గర నుంచి ఫ్యాన్స్ ఆ పాట ఎప్పుడు రిలీజవుతుందా, ఎప్పుడు వింటామా అని ఎంతో ఆతృతగా ఉన్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.