క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలతో చైతూ, శోభిత
చైతన్య, శోభిత తాజాగా క్యాన్సర్ పేషెంట్స్ ను కలిశారు. హైదరాబాద్‌లోని సెయింట్ జ్యూడ్ ఇండియా చైల్డ్ కేర్ ను సందర్శించింది ఈ జంట.
అక్కినేని నాగ చైతన్య గతేడాది డిసెంబర్ లో తన ప్రేయసి శోభితా ధూళిపాలను పెళ్లాడిన విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ డిసెంబర్ లో ఇరు కుటుంబాల నడుమ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. తాజాగా ఈ జంట బయట తళుక్కుమన్నారు.
చైతన్య, శోభిత తాజాగా క్యాన్సర్ పేషెంట్స్ ను కలిశారు. హైదరాబాద్‌లోని సెయింట్ జ్యూడ్ ఇండియా చైల్డ్ కేర్ ను సందర్శించింది ఈ జంట. క్యాన్సర్ ట్రీట్‌మెంట్ కోసం హైదరాబాద్ కు వచ్చే పిల్లలకు, వాళ్ల కుటుంబాలకు ఉచితంగా ఆశ్రయం కల్పిస్తుంది ఈ సెయింట్ జ్యూడ్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్.
తాజాగా ఈ సెంటర్‌కు వెళ్లిన చైతూ దంపతులు అక్కడి పిల్లలతో, వారి తల్లిదండ్రులతో ముచ్చటించి, పిల్లలతో కాసేపు సరదాగా గడిపారు. అంతేకాదు వారితో కలిసి నాగ చైతన్య డ్యాన్సులు వేసి వారికి బహుమతులను కూడా పంచారు. క్యాన్సర్ తో పోరాడుతున్న పిల్లలకు ధైర్యం చెప్పిన ఈ జంట అనంతరం వారితో కలిసి ఫోటోలు కూడా దిగారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు చైతన్య, శోభితల మంచి మనసుని అభినందిస్తున్నారు.
ఇక చైతన్య కెరీర్ విషయానికొస్తే రీసెంట్ గా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నాగ చైతన్య, ప్రస్తుతం తన తర్వాతి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కనున్న మిస్టిక్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కనుంది. మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది.