ఓదెల 2 టీజర్ టాక్
శివునికి తన జీవితాన్ని అంకితం చేసిన నాగ సాధువుకి, ఓ ఆత్మకు మధ్య జరిగే కథ ఆధారంగా ఓదెల2 తెరకెక్కినట్టు టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది.
తమన్నా(Tamannaah) నుంచి తెలుగు మూవీ వచ్చి చాలా రోజులవుతుంది. కొంచెం గ్యాప్ తర్వాత ఇప్పుడు తమన్నా చేసిన సినిమా ఓదెల2(Odela2). ఈ సినిమాలో తమన్నా తనెప్పుడూ కనిపించే పాత్రలకు భిన్నంగా అఘోరి పాత్రలో నటించింది. ఇదిలా ఉంటే ఈ మూవీ టీజర్ ను మహా కుంభ మేళా సందర్భంగా కాశీలో రిలీజ్ చేశారు.
శివునికి తన జీవితాన్ని అంకితం చేసిన నాగ సాధువుకి, ఓ ఆత్మకు మధ్య జరిగే కథ ఆధారంగా ఓదెల2 తెరకెక్కినట్టు టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. టీజర్ మొత్తం చాలా పవర్‌ఫుల్ గా అనిపిస్తుంది. అఘోరి పాత్రలో తమన్నా స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. చాలా మంచి షాట్స్ తో టీజర్ ని కట్ చేయగా, ఆ విజువల్స్ ను తన బీజీఎంతో మరింత థ్రిల్లింగ్ గా మార్చాడు మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్(Ajaneesh Lokanath).
అశోక్ తేజ(Ashok Teja) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంపత్ నంది(Sampathi Nandi) కథ ఇచ్చాడు. నాలుగేళ్ల కిందట రిలీజైన ఓదెల రైల్వే స్టేషన్(Odela Railway Station) కు సీక్వెల్ గా ఓదెల2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొత్తానికి టీజర్ తో అంచనాలను పెంచడంలో ఓదెల2 టీమ్ చాలా బాగా సక్సెస్ అయింది. కాకపోతే టీజర్ లో కొన్ని షాట్స్ చూస్తుంటే అనుష్క(Anushka) నటించిన అరుంధతి(Arundhati) సినిమా గుర్తొస్తుంది.