తమన్నాని ఇంకా వదలట్లేదు..!

బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ చేస్తున్న రైడ్ 2 సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ చేసిందట.;

Update: 2025-04-01 01:30 GMT
తమన్నాని ఇంకా వదలట్లేదు..!

రెండు దశాబ్దాల తర్వాత కూడా తన ఫాం కొనసాగిస్తూ హంగామా చేస్తుంది మిల్కీ బ్యూటీ తమన్నా. అమ్మడు ఇప్పటికి కూడా వరుస సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. త్వరలో ఓదెల 2 తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తమన్నా అటు బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటుంది. లేటెస్ట్ గా అమ్మడు బీ టౌన్ క్రేజీ సీక్వల్ లో స్పెషల్ సాంగ్ ఆఫర్ అందుకుందని టాక్. బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ చేస్తున్న రైడ్ 2 సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ చేసిందట.

సౌత్ లో కూడా తమన్నా చాలా స్పెషల్ సాంగ్స్ చేసింది. స్టార్ హీరోయిన్ గా ఉంటూ ఐటం సాంగ్స్ చేసిన హీరోయిన్స్ లో తమన్నా ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. అదే విధంగా ఇప్పటికీ బాలీవుడ్ లో తమన్నా స్పెషల్ సాంగ్స్ చేస్తుంది. అజయ్ దేవగన్ రైడ్ 2లో తమన్నా సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్ కాబోతుందని తెలుస్తుంది. ఐతే సినిమాలో ఈ సాంగ్ ను విజయ్ గంగూలి కంపోజ్ చేసినట్టు తెలుస్తుంది.

తమన్నా చివరగా బాలీవుడ్ లో స్త్రీ 2 లో స్పెషల్ సాంగ్ చేసింది. రైడ్ 2 లో మరోసారి అమ్మడు తన సాంగ్ తో సర్ ప్రైజ్ చేయనుంది. రైడ్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమా సీక్వె తో మరో క్రేజీ అటెంప్ట్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాను రాజ్ కుమార్ గుప్తా డైరెక్ట్ చేశారు. సినిమా మే 1న రిలీజ్ ప్లాన్ చేశారు.

రైడ్ సినిమాను తెలుగులో రవితేజ మిస్టర్ బచ్చన్ గా రీమేక్ చేశాడు. కానీ ఆ సినిమా తెలుగు ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. ఐతే రైడ్ 2 సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఛాన్స్ లు ఉన్నాయా అంటే కష్టమే అన్నట్టు పరిస్థుతులు కనబడుతున్నాయి. ఐతే రిలీజ్ తర్వాత నిజంగానే పాయింట్ బాగుంటే సినిమా చేసే ఛాన్స్ లు ఉండొచ్చు.

ఇక కెరీర్ పరంగా తమన్నా మాత్రం వచ్చిన ఏ చిన్న ఛాన్స్ ని వదలట్లేదు. ఐతే కెరీర్ ఇలా ఉంటే అమ్మడు పర్సనల్ లైఫ్ లో రియల్ జోడీని ఫిక్స్ చేసుకుందని వార్తలు రాగా.. మళ్లీ వారి మధ్య దూరం పెరిగిందని టాక్. ఏది ఏమైనా 20 ఏళ్లుగా నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ సక్సెస్ ఫుల్ కెరీర్ సాగిస్తుంది తమన్నా.

Tags:    

Similar News