హీరోలంతా ఇక‌ మూతి బిగిస్తే ప‌న‌వ్వ‌ద‌బ్బా!

టీవీ షోలు..ప‌బ్లిక్ షోలు ఎక్క‌డైనా స‌రే మొహ‌మాటానికి గుర‌వ్వ‌కుండా అల‌రిస్తుంటారు.

Update: 2025-01-04 21:30 GMT

సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో బాలీవుడ్ హీరోలు ఎంత ఉత్సాహంగా పాల్గొంటారో చెప్పాల్సిన ప‌నిలేదు. త‌మ సినిమాల్ని ప్రేక్ష‌కుల ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లే విష‌యంలో ఏమాత్రం ఆలోచించ‌రు. ఎవ‌రి స్టైల్లో వారు ప్ర‌చారం చేసు కుంటారు. ఆన్ ది స్క్రీన్ పై ఎలా డాన్సుల‌తో అల‌రిస్తారో ఆఫ్ ది స్క్రీన్ లోనూ అంతే ఉత్సాహంగా డాన్సులు చేస్తుంటారు. చ‌లాకీగా మాట్లాడుతుంటారు. టీవీ షోలు..ప‌బ్లిక్ షోలు ఎక్క‌డైనా స‌రే మొహ‌మాటానికి గుర‌వ్వ‌కుండా అల‌రిస్తుంటారు.

ఈ విష‌యంలో టాలీవుడ్ హీరోలు చాలా కాలంగా వెనుక‌బ‌డే ఉన్నారు. తెలుగు సినిమా ప్ర‌చారంలో టాలీవుడ్ స్టార్ హీరోలంతా కామ్ గోయింగ్ గా క‌నిపిస్తారు. మైక్ ఇస్తే సినిమా గురించి, అభిమానుల గురించి నాలుగు ముక్క‌లు మాట్లాడి వెళ్లిపోవ‌డంతో త‌ప్ప‌! ప్రచారం కోసం అంత‌కు మించి ఏదీ చేయ‌రు. త‌మ సినిమాకి తామే అతిధుల్లా హైలైట్ అవుతుంటారు. స్టేజ్ పై ఓడైలాగ్ చెప్ప‌మ‌న్నా, డాన్స‌ర‌ల్తో క‌లిసి ఓ స్టెప్ వేయాల‌న్న తెగ సిగ్గు ప‌డిపోతుంటారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో కొంత మంది హీరోల్లో మార్పులొస్తున్నాయి.

ఆ విష‌యంలో సీనియ‌ర్ హీరోల్లో విక్ట‌రీ వెంకటేష్ ప‌ద్ద‌తి పూర్తిగా మార్చేసారు. తాను సినిమాలో హీరోనని మూతి బిగించి కామ్ గా కూర్చోకుండా ముందుకొస్తున్నారు. ప్ర‌చారం కోసం ద‌ర్శ‌కుడు చెప్పింది చేస్తున్నారు. `సంక్రాంతికి వ‌స్తున్నాం` ప్ర‌చారం విష‌యంలో వెంకీ ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారో చూస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి త‌ప్ప‌దు అంటే స్టెప్ అందుకుంటున్నారు. `గుంటూరు కారం` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ కూడా డాన్స‌ర్ కోర‌గానే ఓ స్టెప్ వాళ్ల‌తో పాటు క‌లిసి వేసారు.

అలాగే న‌ట‌సింహ బాల‌కృష్ణ లో `అన్ స్టాప‌బుల్` షో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. అస‌లైన బాల‌య్య‌ని ప‌రిచ‌యం చేసిన షో అది. ఆయ‌న హోస్ట్ చేస్తోన్న తీరు చూస్తుంటే ఇదీ అస‌లైన బాల‌య్య అంటే అని పిస్తున్నారు. అయితే ఈ ఎన‌ర్జీ స‌రిపోదు. మ‌రింత ఉత్సాహంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల‌లో హీరోలంతా పాల్గొనాలి. వెంక‌టేష్ స్పూర్తితో మ‌రింత మంది స్టార్లు, యంగ్ హీరోలు ప్రేక్ష‌కుల్ని ఆఫ్ ది స్క్రీన్ పైనా ఎంట‌ర్ టైన్ చేయ‌గ‌ల‌గాలి.

Tags:    

Similar News