లేడీ క్రికెటర్ ప్రియుడుకి అంత సిగ్గా?
అయితే ఈ రిలేషన్ షిప్ గురించి పలాష్ ఇంతవరకూ ఎక్కడా ఓపెన్ అయింది లేదు. ఈ నేపథ్యంలో తాజాగా స్మృతిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
మహిళా క్రికెటర్ స్మృతి మందనా బోయ్ ప్రెండ్ మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ జులైలో తన పుట్టిన రోజు సందర్భంగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. తమ రిలేషన్ కి ఐదేళ్లు పూర్తయిందంటూ పలాష్ తోకలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే ఈ రిలేషన్ షిప్ గురించి పలాష్ ఇంతవరకూ ఎక్కడా ఓపెన్ అయింది లేదు. ఈ నేపథ్యంలో తాజాగా స్మృతిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
'నాకు సిగ్గు ఎక్కువ. ఈవెంట్లలో , పార్టీల్లో ఫోటోలు దిగే సమయంలో చాలా సిగ్గుపడతాను. స్మృతి బోయ్ ప్రెండ్ అయినందుకు నేనెంతో గర్వపడుతున్నాను. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతాను. అందుకే ఇన్ని రోజులు మా రిలేషన్ గురించి నేను ప్రత్యేకించి ఎక్కడా మాట్లాడలేదు. మహిళల ప్రీమియర్ లీగ్ సమయంలో నేను ఆమెతో మైదానంలో ఉన్నప్పుడు కెమెరాను చూడలేదు.
ఒకవేళ కెమోరా మమ్మల్ని చిత్రీకరిస్తుందేమోనన్న భయంతోనే అలా చేసాను. అక్కడ ఉండటం అసౌకర్యంగా ఫీలై వెళ్లిపోయాను. కానీ ఇప్పుడు మా బంధం గురించి అందరికీ తెలిసిపోయింది. నేను ఏ కార్యక్రమానికి వెళ్లినా ప్రజలంతా ఆర్ సీబీ, ఆర్ సీబీ అని కేరింతలు కొడుతున్నారు' అని అన్నాడు. పలాష్ ముచ్చల్ మ్యూజిక్ కంపోజర్. పేద పిల్లలకు నిధులు సమకూర్చడం కోసం భారత్ తో పాటు విదేశాల్లోనూ స్టేజ్ షోలో నిర్వహిస్తుంటాడు.
తొలుత వీరిద్దరు ప్రేమలో పడ్డారు అనే ప్రచారం ఎలా మొదలైంది అంటే పలాష్ చేతిపై ఎస్ ఎమ్ 18 అనే టాటూ కనిపించింది. ఆమె ఆడే మ్యాచులకు హాజరవుతుంటాడు. దీంతో వీరిద్దరు ప్రేమలో పడ్డారంటూ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. వాటిని ఏ ఒక్కరూ ఖండిచకపోవడంతో వ్యవహారం నిజమేనని కథనాలు పీక్స్ కు చేరాయి. దీంతో ఇరువురి పుట్టిన రోజు సందర్భంగా ఫోటోలతో హింట్ ఇచ్చారు.