సంయుక్తకు వైన్ తాగే అలవాటు! అసలు విషయమిది..

2025లో వివిధ చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది సంయుక్త.

Update: 2025-02-18 20:30 GMT

హీరోయిన్ సంయుక్త మీనన్.. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. తెలుగులో స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న ముద్దుగుమ్మ.. సౌత్ లో వరుస అవకాశాలతో, షూటింగ్స్ తో బిజీ బిజీగా గడుపుతోంది. 2025లో వివిధ చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది సంయుక్త.

అయితే కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ షేర్ చేస్తూ మైమరపిస్తుంటోంది సంయుక్త. ఎక్కువగా చీరల్లో అందాలు ఆరబోసే సంయుక్త చేసే సందడే వేరు. అదే సమయంలో కొద్ది రోజులుగా సంయుక్త త్రోబ్యాక్ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ గా మారాయి.

ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో సంయుక్త.. తన లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతూ వైన్ తాగే అలవాటు ఉన్నట్టు తెలిపింది. అది కూడా చాలా రేర్ అని చెప్పింది. ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరికీ భిన్నమైన లైఫ్ స్టైల్ ఉంటుందని.. అదే విధంగా తనకు కూడా ఉందని చెప్పింది. దీంతో సోషల్ మీడియాలో సంయుక్త కామెంట్స్ పై రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి.

అయితే కొన్ని సమయాల్లో అతి కొద్దిగా వైన్ తీసుకుంటానని తెలిపింది సంయుక్త. కానీ ఎలాంటి బ్యాడ్ హాబిట్స్ లేవని చెప్పింది. ఫిజిక్, బ్యూటీ పరంగా కొన్ని అలవాట్లు వస్తాయని పేర్కొంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో అసలు విషయమిదని అంతా కామెంట్లు పెడుతున్నారు.

ఇక సంయుక్త కెరీర్ విషయానికొస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ భీమ్లా నాయక్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. డేనియల్ శంకర్ రానా దగ్గుబాటి వైఫ్ పాత్రలో చక్కగా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత బింబిసార, విరూపాక్ష, సార్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను సొంతం చేసుకుంది అమ్మడు.

ఇప్పుడు తెలుగు, మలయాళంలో వరుస సినిమాలు చేస్తోంది సంయుక్త. మెయిన్ గా టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. బింబిసార 2, నిఖిల్ స్వయంభు వంటి చిత్రాలతో పాటు, బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ అఖండ 2 వంటి సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. ఇప్పటికే ఆ మూవీలపై మంచి బజ్ ఉంది. దీంతో ముద్దుగుమ్మ ఎలాంటి హిట్స్ అందుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News