మేడే నుంచి ఇండిపెండెన్స్ డేకి మారుతున్నారా?
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో `కూలీ` భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో `కూలీ` భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమాపై భారీ బజ్ నెలకొంది . సూపర్ స్టార్ రోల్ ఎలా ఉండబోతుంది? అతడి మార్క్ ఎలివేషన్ లోకేష్ ఎలా ప్లాన్ చేసాడం టూ? నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది. ఎల్ సీ యూతో సంబంధం లేకుండా లోకేష్ తెరెక్కిస్తోన్న కొత్త చిత్రమిది.
దీంతో సూపర్ స్టార్ సైతం ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగింపు దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని పనులు పూర్తి చేసి కార్మికుల దినోత్సవం సందర్భంగా మే 1న చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. అయితే ఇప్పుడా సినిమా మే నుంచి ఆగస్టు వాయిదా పడుతున్నట్లు సమాచారం. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారుట.
దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రిలీజ్ తేదీకి..ఈ సినిమా కాన్సెప్స్ కి కొంత దగ్గర సంబంధం ఉందని వినిపిస్తుంది. ఇందులో రజనీకాంత్ గోల్డ్ స్మగ్లర్ పాత్ర పోషిస్తున్నారు. అసలు స్మగ్లర్ గా మారడానికి కారణాలు ఏంటి? సినిమాలో రజనీకాంత్ గతం ఏంటి? అన్నది చాలా బలంగా.. ..ఇంపాక్ట్ గా లోకేష్ చెప్పబోతున్నాడుట. ఆ పాయింట్ నిజాయితీగా కష్టపడే వారికి కనెక్ట్ అయ్యేలా ఉంటుందిట.
ఈ నేపథ్యంలోనే తొలుత కార్మికుల దినోత్సవం సందర్బంగా మేలో రిలీజ్ అనుకున్నారని అప్పట్లోనే వార్తలొచ్చాయి. కానీ అప్పటికి షూట్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తవ్వడం సాధ్యం కాదని దీంతో ఆగస్టు 15 కి వాయిదా వేస్తున్నారని కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.