బుట్ట బొమ్మను ఇలాంటి లుక్‌లో చూశారా ఎపుడైనా?
ఓవరాల్ గా ఈ ఫోటోషూట్ లో ఇది యూనిక్ లుక్ అనడంలో సందేహం లేదు.
ముంబై బ్యూటీ పూజా హెగ్డే ఇటీవల చెన్నై సర్కిల్స్ లోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఈ బ్యూటీ నిరంతరం తన అభిమానులను అలరించేందుకు వరుస ఫోటోషూట్లతో ప్రత్యేక గేమ్ ని ప్లాన్ చేసింది. ఇటీవలే స్టైలిష్ బ్లేజర్ లో స్పెషల్ లుక్ లో కనిపించిన పూజా, ఇంతలోనే ఇప్పుడు ప్రఖ్యాత హెచ్.టి టైమ్ కవర్ షూట్ లో పాల్గొంది. ఈ కవర్ ఫోటోషూట్ కోసం పూజా మరింత బోల్డ్ గా మారింది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోషూట్ కి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. పూజా రకరకాల డిజైనర్ లుక్స్ లో కనిపించగా, వీటిలో పట్టీలతో రూపొందించిన ఒక ప్రత్యేకమై డిజైనర్ డ్రెస్ తనలోని హాట్ కంటెంట్ ని మరింత హైలైట్ చేసింది. ఓవరాల్ గా ఈ ఫోటోషూట్ లో ఇది యూనిక్ లుక్ అనడంలో సందేహం లేదు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. పూజా హెగ్డే కు బాలీవుడ్ ఆశించిన విధంగా కలిసి రాలేదు. అక్కడ మంచి ఫలితాలు రాలేదు. అదే సమయంలో కోలీవుడ్ టాలీవుడ్ తనను ఆదుకున్నాయి. అయితే ఇటీవల భారీ పారితోషికం, ఇతర డిమాండ్ల కారణంగా పూజా తెలుగు చిత్రసీమలో ఉనికిని కోల్పోయింది. వరుసగా అగ్ర హీరోల సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇలాంటి కారణాలతో, ప్రస్తుతం పూజా తమిళ సినిమాపై దృష్టి సారించింది. విజయ్ జన నాయగన్, సూర్య రెట్రో చిత్రాలకు కమిటైన పూజా, తదుపరి రజనీకాంత్ కూలీలో ఒక ప్రత్యేక పాటలో కనిపించనుందని కథనాలొస్తున్నాయి. పూజా ఇప్పటికే ప్రత్యేక గీతం షూటింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ పాటలో రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర కూడా మెరుపులా మెరుస్తారని తెలుస్తోంది. జైలర్ చిత్రంలో తమన్నా భాటియా ఒక ప్రత్యేక పాటలో అదరగొట్టింది కాబట్టి, ఈ పాట కోసం పూజా హెగ్డేను ఎంపిక చేయాలని నిర్మాతలు భావించినట్టు తమిళ మీడియాలో కథనాలొస్తున్నాయి.
ఇప్పటికే పూజా రంగస్థలం , F3లో కూడా అలాంటి ప్రత్యేక పాటతో కుర్రకారు మనసులను గెలుచుకుంది. రజనీ కూలీలో ప్రత్యేక పాటను భారీ సెట్‌లో చిత్రీకరించనున్నట్లు చెబుతున్నారు. కూలీ ఇప్పటికే వేసవి రేస్ నుంచి దూరంగా జరిగి ఆగస్టులో రానుందని కథనాలొచ్చాయి. మేకర్స్ ఏప్రిల్‌లో మొత్తం షూటింగ్‌ను పూర్తి చేస్తారని తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ ఈ చిత్రంతో మరో భారీ బ్లాక్ బస్టర్ పై కన్నేశాడని కూడా తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను సకాలంలో పూర్తి చేస్తున్నాడని తమిళ మీడియాలో కథనాలొచ్చాయి. మరోవైపు ఖైదీ 2 కోసం స్క్రిప్ట్ పనిని పూర్తి చేసి, తన తదుపరి చిత్రాలకు కూడా లోకేష్ సిద్ధం కానున్నాడని తెలిసింది. అనిరుధ్ రవిచందర్ కూలీ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయనున్నాడు. కూలీలో శ్రుతి హాసన్, సత్యరాజ్ మరియు సౌబిన్ షాహిర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.