సర్దార్ గబ్బర్ సింగ్ కి దర్శకుడు కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ. రవితేజతో పవర్ సినిమా చేసి సక్సెస్ సాధించడంతో, పవన్ దృష్టిని ఆకర్షించాడు. సంపత్ నందిని తప్పించి, తనను డైరెక్టర్ గా తీసుకోవడంతో బాబీ తెగ హ్యాపీగా ఫీలయ్యాడు. కానీ ఈ ఆనందం మాత్రం ఎక్కువ కాలం నిలవలేదు. సర్దార్ గబ్బర్ సింగ్ ను పవన్ కళ్యాణ్ తనే డైరెక్ట్ చేసేస్తున్నాడని.. పేరు మాత్రం బాబీది ఉంటోందనే వార్తలు షికారు చేశాయి.
తనపై ఎన్ని రూమర్స్ వచ్చినా.. ఇది పవన్ సినిమా కావడంతో బాబీ ఎప్పుడూ స్పందించలేదు. కానీ మనసులో మాత్రం ఆ వెలితి ఉండిపోయిందనే విషయం సర్దార్ ఆడియో రిలీజ్ రోజున అర్ధమైపోయింది. ఈ మూవీ కోసం బాబీ చాలా కష్టపడ్డాడంటూ ఆలీ చెబుతున్న క్షణంలో.. బాబీ చప్పట్లు కొడుతూ కనిపించాడు. అంటే.. తనే డైరెక్టర్ అన్న క్రెడిట్ ని అప్పుడు ఎంజాయ్ చేశాడు బాబీ.
ఆ తర్వాత స్టేజ్ పై త్రివిక్రమ్ కూడా బాబీకి దర్శకుడిగా పడుతున్న కష్టానికి సంబంధించి... ఎప్పుడూ మాట్లాడ్డం కుదరలేదని, కెమేరా వెనక పరుగెడుతూనే కనిపించాడని.. ఆ క్రెడిట్ ఇచ్చేశాడు. అయితే.. పవన్ స్పీచ్ లో మాత్రం అందరితో పాటు దర్శకుడిని పొగడ్డం తప్ప.. డైరెక్టర్ గా అతని ప్రతిభకి సంబంధించిన సంగతులు మాత్రం వినిపించలేదు.