టాలీవుడ్లో రంగస్థలం' వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ కాస్త గ్యాప్ తీసుకుని తీస్తున్న సినిమా 'పుష్ప'. ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - రష్మిక హీరో హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. 'పుష్ప' పోస్టర్ చూస్తే లెక్కల మాస్టర్ సుకుమార్ మరో ప్రయోగానికి తెరలేపాడని ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమైపోతుంది.
రాయలసీమ చిత్తూరు యాస, భాషతో పాటు బన్నీ ఊరమాసు మొరటు కుర్రాడిగా ఇరగదీస్తాడనిపిస్తుంది. శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా ఊర మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ చిత్రంలో విజయ్ సేతుపతి అటవీశాఖ అధికారిగా నటిస్తున్నట్లు న్యూస్ బయటకి వచ్చింది. ఇటీవల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు విజయ్ సేతుపతి ప్రకటించారు. అయితే ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్ అధికారులు, చాలా మంది తమిళులను స్మగ్లర్లుగా భావించి వారిని కాల్చి చంపిన నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న కారణంగా తమిళ హీరో అయిన విజయ్ సేతుపతి ఈ పాత్రలో నటిస్తే తమిళ అభిమానుల మనోభావాలు దెబ్బతింటాయనే ఉద్ధేశంతో ఆయన ఈ సినిమా నుంచి వైదొలిగినట్లు సమాచారం.
అందువల్ల ఈ విలన్ క్యారక్టర్ కోసం తమిళ స్టార్ యాక్టర్ బాబీ సింహాని తీసుకోవాలని సుక్కు అండ్ టీమ్ డిసైడ్ అయినట్లు సమాచారం. మొన్ననే 'డిస్కో రాజా'తో తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ నేషనల్ అవార్డు విన్నర్ 'పుష్ప'లో ఆఫర్ వస్తే టాలీవుడ్ లో విలన్ గా పాగా వేసే అవకాశం ఉంది. పాన్ ఇండియా సినిమా కావడంతో పలువురు ఇతర ఇండస్ట్రీ నటులను తీసుకునే పనిలో ఉన్నారు 'పుష్ప' టీమ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్, ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సుక్కు ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.