మన సినిమా పుట్టి 100 ఏళ్ళు దాటింది కదా. అలాగే ఈ వంద ఏళ్లలో ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. కొన్ని సినిమాలు సినీ పరిశ్రమ దిశను మార్చినివి ఉన్నాయి. అలాంటి సినిమాలును గుర్తు చేసుకోవడం వాటికి మనం ఇచ్చుకున్న గౌరవం. మొన్న మన తెలుగులో కూడా ‘శివ’ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సంధర్భంగా ఆ సినిమా టీమ్ అంతా కలిసి ఒక పండుగ చేసుకున్నారు. అలానే హింది వార్ డ్రామాలో క్లాసిక్ లా నిలిచిపోయాన సినిమా 'బోర్డర్'. ఈ సినిమా వచ్చే జూన్ 11 నాటికి 20 వసంతాలు పూర్తి చేసుకోబోతుంది.
ఇదే విషయాన్ని బోర్డర్ సినిమా దర్శకుడు జె పి దత్తా కుమార్తె నిధి వెల్లడించారు. “బోర్డర్ సినిమా మా నాన్నగారు సినిమా కెరీర్లో ఒక గొప్ప మైలురాయి. ఈ సినిమాలోని డైలాగ్, పాటలుతో సహ అన్నీ గుర్తు పెట్టుకున్నారు సినీ అభిమానులు. అంతటి గొప్ప సినిమాను మళ్ళీ గుర్తుచేసుకొని ఆ సినిమాకు పని చేసిన అందరితో కలిసి ఆ ఆనందాన్ని పంచుకోవాలని భావిస్తున్నాము. ఇంకా ఎక్కడ అనేది ఏమి అనుకోలేదు. ఈ కార్యక్రమం లో అప్పటి తెర వెనుక సరదాలు వాళ్ళు పడ్డ కష్టం తెలిపే వీడియొలు కూడా ప్రదర్శిస్తాము” అని తెలిపారు.
1997 లో విడుదలైన ఈ సినిమాలో సన్నీ డియొల్, జాకీ ష్రాఫ్, సునిల్ శెట్టి, అక్షయ్ ఖన్నా, పూజ భట్, తబు తదితరులు నటించారు. 1971 లో జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధం లో జరిగిన ఒక రియల్ స్టోరీని సినిమాగా తీశారు. ఈ మధ్యనే బోర్డర్ 2 సినిమా కూడా నిర్మించే ఉద్దేశం ఉంది అని ఊహాగానాలు వస్తున్నాయి.