'సరైనోడు'' సినిమా ఇప్పటికే 54 కోట్లు షేర్ వసూలు చేసి.. దాదాపు పంపిణీదారులందరికీ ఎంత పెట్టారో అంత తిరిగి తెచ్చేసింది. ఇక ఇదే సమయంలో సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారా గురువు గారూ అంటే.. అమ్మో చేయట్లేదు.. ఎందుకంటే తదుపరి సినిమా ఇంకా పెద్ద హిట్టు కొట్టాలనే భారం నాపైన ఉంది అంటూ సెలవిచ్చాడు దర్శకుడు బోయపాటి శ్రీను.
ఇక మనోడి గురించి.. హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్ అండ్ క్యాథరీన్ త్రెసాలు మాత్రం.. చాలా బాగానే చెప్పారు. తాము ఈ సినిమాలో ఏడ్చిన ప్రతీ సీన్ లోనూ.. గ్లిజరిన్ లేకుండానే ఏడిపించేశాడు బోయపాటి. మామూలుగా 'టాలెంటడ్' తేజ వంటి దర్శకులు అయితే.. అనిత వంటి హీరోయిన్లను చెంప దెబ్బ కొట్టి మరీ ఏడిపించారు. కాని బోయపాటి మాత్రం.. సీన్ వెనుక ఉన్న బ్యాక్ స్టోరీ వివరించి.. సరైనోడు కోర్టు సీన్ లో ఉన్నరేప్ కేసెస్ తాలూకు ఇంటెన్సిటీని మైకులో లైవ్ గా క్యాథరీన్ కు ఎక్సప్లెయిన్ చేయగా.. ఆమెకు నిజంగానే ఏడుపు వచ్చేసిందట.
రకుల్ కూడా అంతే. చాలా ఏడుపు సీన్లు.. బోయపాటి మైకులో బ్యాగ్రౌండ్ స్కోర్ తో కలిపి మరీ హింట్లు ఇవ్వడంతో.. నిజంగానే ఏడుపు వచ్చేసిందని చెప్పుకొచ్చింది. మొత్తానికి హీరోయిన్లను ఎలా ఏడిపించాలి అంటే.. బోయపాటి దగ్గర క్లాస్ తీసుకోవాల్సిందే. అంతేకాని.. వారి సున్నితమైన చెంపల మీద ఇష్టమొచ్చినట్లు కొట్టకండి గురూ.