బ‌న్నీ మొద‌టి పారితోషికం రూ.100.. ఇచ్చిన రాఘ‌వేంద్ర‌రావు!

Update: 2021-05-28 14:30 GMT
అల్లు అర్జున్ కెరీర్ గంగోత్రి సినిమాతో మొద‌లైంది అన్న సంగ‌తి తెలిసిందే. ఆ చిత్ర ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు అన్న సంగ‌తి కూడా తెలిసిందే. మ‌రి, ఈ చిత్రానికి బ‌న్నీ రెమ్యున‌రేష‌న్ ఎంత‌? ఈ విష‌యం చాలామందికి తెలియ‌దు. అయితే.. బ‌న్నీ మొద‌టి పారితోషికం మాత్రం వంద రూపాయ‌లే అన్న‌ది వాస్త‌వం. ఈ విష‌యాన్ని బ‌న్నీ కూడా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. అదేంటీ.. మ‌రీ వంద‌నా అనుకుంటున్నారా? అయితే.. ఈ స్టోరీ చ‌ద‌వాల్సిందే.

అల్లు అర్జున్ హీరోగా మొద‌టి చిత్రం గంగోత్రి అయిన‌ప్ప‌టికీ.. అంత‌క‌న్నా ముందే మ‌రో చిత్రంలో న‌టించాడు. అదే మెగాస్టార్ 'డాడీ'. అంటే.. టెక్నిక‌ల్ గా అల్లు అర్జున్ మొద‌టి సినిమా డాడీ అన్న‌మాట‌. ఈ చిత్రంలో డ్యాన్సర్ గా క‌నిపిస్తాడు. బ‌య‌ట కూడా డ్యాన్స్ తో దుమ్ములేపే బ‌న్నీ.. మొద‌టి సినిమాలో ఇదేపాత్ర‌లో క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఈ సినిమాకు ఏమైనా అమౌంట్ ఇచ్చారా? అన్న‌ది తెలియ‌దు.

అయితే.. ఈ సినిమాక‌న్నా కొన్నేళ్ల‌ ముందు మెగా ఫ్యామిలీకి సంబంధించిన పార్టీ ఒక‌టి జ‌రుగుతోంది. ఈ వేడుక‌కు ఎంతో మంది ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా అంద‌రూ హ్యాపీ మూడ్ లో చిందులేస్తున్నారు. అందులో ఓ చిన్నోడు కూడా మాంచి స్టెప్పుల‌తో ఇర‌గ‌దీస్తున్నాడు. ఆ డ్యాన్స్ చూసి ముగ్ధుడైన ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు.. వంద‌రూపాయ‌లు అత‌డి చేతిలో పెట్టాడ‌ట‌. అత‌డెవ‌రో కాదు.. ఫ్యూచ‌ర్ స్టార్ అల్లు అర్జున్!

ఆ త‌ర్వాత కొన్నేళ్ల‌కు వీరిద్ద‌రూ క‌లిసి సినిమా తీయ‌డం.. అది బ‌న్నీకి మొద‌టి సినిమా, రాఘ‌వేంద్ర‌రావుకు వందో సినిమా కావ‌డం విశేషం. ఇందుకుగానూ వంద రూపాయ‌ల పారితోషికం సంవ‌త్స‌రాల ముందే అందుకోవ‌డం ఇంకా విశేషం. ఈ వంద రూపాయ‌లు ఇప్ప‌టికీ బ‌న్నీ మ‌ద‌ర్ వ‌ద్ద ఉన్నాయ‌ట‌. ఈ విష‌యాన్ని బ‌న్నీ వెల్ల‌డించాడు కూడా. భ‌లే విచిత్రంగా ఉంది క‌దూ.. ఈ వంద రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ క‌థ‌!
Tags:    

Similar News