అంతరిక్షం 9000 కెఎంపీహెచ్ డిసెంబర్ 21న రిలీజవుతోందని నిర్మాతలు ప్రకటించారు. భారీ గ్రాఫిక్స్- వీఎఫ్ ఎక్స్ నేపథ్యంలో శాటిలైట్ కమ్యూనికేషన్ ఫెయిలయ్యే ప్రమాదాన్ని అధిగమించేందుకు యువ సైంటిస్టులు ఏం చేశారు? అన్న కాన్సెప్టుతో తెరకెక్కించారు. ప్రమాదం నుంచి కాపాడేందుకు దేవ్ (వరుణ్ తేజ్) చేపట్టిన మిషన్ ఆసక్తిని పెంచింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై క్రిష్ జాగర్లమూడి- రాజీవ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ ఏఎంబీ సినిమాస్ లో అంతరిక్షం ట్రైలర్ ని లాంచ్ వేడుకలో సుకుమార్- అల్లు అరవింద్- క్రిష్ వంటి ప్రముఖులు ముచ్చటించారు. అసలు అంతరిక్షం గురించి వీళ్లంతా ఏమన్నారు? అన్నది పరిశీలిస్తే..
అల్లు అరవింద్ మాట్లాడుతూ - ``క్రిష్- రాజీవ్ కలిసి అద్భుతాలు చేస్తున్నారు. ప్రయత్న ంలో నే ఫెయిలైతే వేరు.. ప్రయత్నించకపోవడమే ఫెయిల్యూర్ అని నిర్ణయించుకుని ఆ ఇద్దరూ అనుకుని తీస్తున్నట్టే అనిపించింది. చిన్న సినిమా గా చేస్తుంటే, దీనిని బెటర్ సినిమాగా చేయాలని వారు బరిలో దిగి తీస్తున్నారు. ఇలాంటి కొత్తదనాన్ని మనపరిశ్రమకు తీసుకు రావడానికి సంకల్ప్ లాంటి ప్రతిభావంతుడు వచ్చినందుకు తనని ఘనంగా ఆహ్వానించాలి. గీత గోవిందం లాంటివి ఆడాయి. కానీ ఇలాంటి ఓ కొత్త ప్రయత్నాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వరుణ్ మా ఫ్యామిలీ లో ఓ డైమండ్. అందరూ వరుసగా సినిమాలు చేస్తాం కానీ.. తను వెరైటీ సినిమాలు చేస్తున్నాడు. డిఫరెంట్ యాటిట్యూడ్ ఉన్న హీరో`` అన్నారు.
క్రిష్ మాట్లాడుతూ - ``ఒక దర్శకుడు ఎలాంటి కథ అయినా రాసుకోవచ్చు. తీయడానికి నిర్మాతలు దొరుకుతారు. కానీ ఇలాంటి కథ నేను చేస్తాను అని హీరో ముందుకు రాకపోతే ఇలాంటివి ముందుకు వెళ్లవు. అలాంటివి ఇప్పటికే వందల కథలు ఉన్నాయి. ఈ సినిమా అంగీకరించిన వరుణ్ తేజ్ కే అగ్రభాగం క్రెడిట్ దక్కుతుంది. సంకల్ప్ ప్రతిదీ స్టోరిబోర్డ్ వేసుకుని క్లారిటీతో చెప్పాడు కథ. తొలి కాపీ చూసి గర్వ ంగా ఫీలయ్యాను. ఇందులో భాగం అయినందుకు గర్వ ంగా ఫీలవుతున్నా. గొప్ప సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. రామకృష్ణ-విహారిక వేసిన సెట్స్ అంతరిక్షంలోకే తీసుకుని వెళ్లాయి. వరుణ్ లాంటి హీరోలు ఒప్పుకుంటేనే ఇవి వస్తాయి. ఇలాంటివి మరిన్ని చేయాలి`` అన్నారు. సంకల్ప్ రెడ్డి మాట్లాడుతూ- ``నా టీమ్ గొప్పది. సాంకేతిక నిపుణులు మిగతా పనుల్లో బిజీగా పని చేస్తున్నారు. అంతరిక్షం కోసం ఏకంగా 1500 పైగానే వీఎఫ్ ఎక్స్ షాట్స్ తీశాం. 8-9 నెలల్లో ఈ సినిమా పూర్తి చేశాం. డిసెంబర్ 21న ఈ సినిమా వస్తుంది. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేంత విషయం ఉంటుంది. ఘాజీ టైమ్ లో కష్టపడ్డాను. కానీ ఇప్పుడు అంత కష్టం ఏం లేదు. స్టాండార్డ్ కుదిరింది. దానిని రీచ్ అయ్యాను`` అన్నారు.
దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ - అద్భుతం అని చాలాసార్లు అంటుంటాం కానీ .. ఇది నిజంగానే అద్భుతం. ఆ పదం చాలా అరుదుగానే సూటవుతుంది. అంతరిక్షం కి కుదిరింది. ముఖ్య ంగా సంకల్ప్ గురించి చెప్పాలి. ఓ ఇంటి కప్పు మీద సెట్ వేసుకుని సినిమా తీసే ప్రయత్న ం చేస్తే, అలా అతడి కి ఘాజీ అవకాశమే వచ్చింది. అప్పుడలాంటి సినిమా తీశావ్. ఇప్పుడు ఏకంగా అంతరిక్షం సినిమానే తీస్తున్నాడు. సంకల్ప్ సముద్రం అడుగు నుంచి అమాంతం అంతరిక్షానికి వెళ్లాడు. ఇక్కడి నుంచి వరుణ్ ట్రై చేస్త అంతరిక్షం అందేస్తుందేమో! సంకల్ప్ క్రమశిక్షణ గొప్పది. మేలో ప్రారంభించి ఇలాంటి సీజీ సినిమాని డిసెంబర్‌లో రిలీజ్ చేస్తున్నారంటే గ్రేట్. క్రిష్, నేను తనకు అసిస్టెంట్లు గా చేయాల్సిందేనని క్రిష్ తో నేను అన్నాను. వరుణ్ తేజ్ గురించి చరణ్ అంటుంటారు.. వరుణ్ కి మంచి జడ్జిమెంట్ ఉంది అని. చిరంజీవి, రజనీకాంత్, అమితాబ్ లాంటి వాళ్లు నటనతో పాటు జడ్జిమెంట్‌తోనే సూపర్‌స్టార్లు అయ్యారు. ఇక వరుణ్ జడ్జిమెంట్ గురించి చరణ్ చెబుతుంటాడు. ఫిదా లాంటి పెద్ద హిట్ తర్వాత చిన్న దర్శకులకు అవకాశం ఇస్తున్నాడు. ఎఫ్2 తో విభిన్న ంగా ప్రయత్నిస్తున్నాడు. నటన పరంగా ఎంతో పరిణతి చెందుతున్నావు. నటన పరంగా అంతరిక్షంలోకి దూసుకెళుతున్నావ్. నిర్మాత రాజీవ్ కంచె తర్వాత మరో మంచి సినిమా చేస్తున్నారు. కళాదర్శకులు ది బెస్ట్. తెలుగు సినిమా అంతరిక్షం వైపు దూసుకెళుతోంది. అంతరిక్షం పెద్ద విజయం సాధించాలి`` అన్నారు.