యంగ్ హీరో శ్రీ విష్ణు రూట్ మార్చిన సంగతి తెలిసిందే. ఇంత వరకూ కాస్త ఇన్నోవేటివ్ గా వెళ్లిన యంగ్ హీరో ఇప్పడు కొత్త పంథాలో ప్రయాణం మొదలు పెట్టాడు. `భళా తందనాన` తో తనలో యాక్షన్ యాంగిల్ ని చెప్పే ప్రయత్నం చేసాడు. తొలి ప్రయత్నం పర్వాలేదనిపించినా బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. రోటీన్ గానే రాణించింది.
అంతకు మందు వరకూ పక్కింటి కుర్రాడు పాత్రలత్లో మెప్పించిన శ్రీ విష్ణు ఒక్కసారిగా ఇలాంటి టర్న్ తీసుకోవడం ఓ సెక్షన్ ఆడియన్స్ ని ఆలోచనలో పడేసింది. అయినా నాకో థీయరీ ఉందంటూ యంగ్ హీరో మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం `అల్లూరి` అనే సినిమా చేస్తున్నాడు. ఇది భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అని ప్రచార చిత్రాలు చూస్తేనే తెలుస్తోంది.
ఇది కాఖీ స్టోరీ. అల్లూరి పాత్ర కోసం శ్రీ విష్ణు గెటప్ పూర్తిగా మార్చేసాడు. న్యూ మేకోవర్ లో కనిపిస్తున్నాడు. మునుపెన్నడు చూడని కొత్త శ్రీ విష్ణుని తెరపై ఆవిష్కరిస్తున్నాడు. కంటెంట్ పరంగా హై యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. సెన్సార్ ముందుకెళ్లిన సినిమా సవాళ్లను ఎదుర్కుంటున్నట్లు కనిపిస్తుంది. సెన్సార్ నిబంధనలు అతిక్రమించి కొన్ని సన్నివేశాలు ఉండటంతో వాటికి కత్తెర పడ్డట్లు సమాచారం.
టెర్రరిస్టులకు దొరికిన హీరోకు ఉప్పెన తరహాలో దారుణంగా అతన్ని గాయపరిచే ఎపిసోడ్ ఒకటి ఉంటుందిట. ఆ ఎపిసోడ్ ని సగానికి తగ్గించమని సెన్సార్ సూచించినట్లు సమాచారం. ఆ సన్నివేశానికి దాదాపు ఏడు నిమిషాల కోత ఉంటుందని తెలుస్తుంది. దీన్ని బట్టి సినిమాలో ఇలాంటి యాక్షన్ సన్నివేశాలు ధారాళంగానే ఉంటాయని లీకులందుతున్నాయి.
సెన్సార్ సర్టిఫికేషన్ వస్తే తప్ప యాక్షన్ డోన్ గురించి క్లారిటీ రాదు. ఈ సినిమా సక్సెస్ పై శ్రీ విష్ణు చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఇటీవల కాలంలో చేస్తోన్న ఏ ప్రయత్నం సరిగ్గా ఫలించడం లేదు. శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నా ఫలితాలు నిరాశ పరుస్తున్నాయి. నటుడిగా తాను పాస్ అయిపోతున్నా? బాక్సాఫీస్ వద్ద అంతిమ ఫలితం నిరాశనే అందిస్తుంది.
ఇవన్నీ ఆలోచించే యంగ్ హీరో కథల పరంగా ఛేంజ్ తీసుకొచ్చాడు. మరి ఈ కొత్త తరహా ప్రయత్నాలైనా శ్రీ విష్ణుకి కలిసొస్తాయే మో చూడాలి. అవకాశాల పరంగా ఢోకాలేదు. తనకున్న ఇమేజ్ తో ఛాన్స్ లు అందుకుంటున్నాడు. ఆక్రేజ్ కి సక్సెస్ తోడైతే నటుడిగా మరింత బిజీ అవుతాడు. మరి యంగ్ హీరో టైమ్ ఎలా ఉందన్నది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.